వికారాబాద్, మే 29 : తెలంగాణ ఉద్యమం లో క్రియాశీల పాత్ర పోషించిన వారిని పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వికాస్ జూనియర్ కళాశాలలో తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ(తెలంగాణ ఐకాస)జిల్లా మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమనేత శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన మీటింగ్ కు తెలంగాణ ఉద్యమకారులు అధిక సంఖ్య లో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యమకారులను గుర్తించి వారికి ప్రభుత్వ ఫలాలను అందించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
అనంతరం శుభప్రద్‌పటేల్ మాట్లాడుతూ.. జిల్లాలో పలువురు మేధావులు, కళాకారులు, జర్నలిస్టులు, ఉద్యోగులు, విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో మాతో కలిసి క్రియాశీల పాత్ర పోషించారన్నారు. వారిపైనా కేసులు నమోదైతే వారి భవిష్యత్తు దృష్ట్యా కేసుల నుంచి తప్పించామని, వారికీ రాష్ట్ర ప్రభు త్వం న్యాయం చేయాలన్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమ నాయకుడు, రాష్ట్ర ఆర్టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల పట్ల సానుకూల వైఖరితో ఉన్నదని.. అందులో భాగంగానే ఉద్యమ నాయకులతో కేశవరావు అధ్యక్షతన కమిటీ వేయడం జరిగిందన్నారు.
ఉద్యమకారుల ప్రతిపాదనలను కేశవరావు నేతృత్వంలో కమిటీకి, ముఖ్యమంత్రికి నివేదిద్దామని సూచించారు. సమావేశంలో ఉద్య మ నాయకులు విజయ్‌కుమార్, సురేశ్, రవిశంకర్, గంగ్యాడ నాయక్, కె.భాను, రామచందర్, శివకుమార్‌రెడ్డి, శాంత్‌కుమార్, దేవదాసు, మారుతి, శ్రీకాంత్, బాలరాజ్ నాయ క్, శంకర్, అంజయ్య, సమద్, జాకీర్, కృష్ణయ్య, పలువురు అధ్యాపకులు, విద్యార్థి సంఘాల నాయకులు, మేధావులు పాల్గొన్నారు.