ఆమనగల్లు : పట్టణంలోని గంగాభవాని కాలనీ శ్రీ అభయాంజనేయస్వామి దశమ వార్షికోత్సవ ( Temple Anniversary ) ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
కాలనీలో పదవ తరగతి( Tenth), ఇంటర్మీడియెట్( Intermediate) పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 15 మంది విద్యార్థులకు శాలువా, పూలమాలలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు ఎంగలి బాలకృష్ణయ్య, కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు సత్తయ్య, కోశాధికారి సాయికుమార్, కార్యవర్గసభ్యులు పరమేష్, మురళీధర్, సుధాకార్, లింగం, ఈశ్వరయ్య, ఎంగలి యాదగిరి, లింగప్ప, అశోక్ తదితరులు ఉన్నారు.