తాండూరు, డిసెంబర్ 17 : తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌తో అస్వస్థతకు గురైన 11 మంది విద్యార్థినుల్లో వైశాలి, రక్షితలకు మాతాశిశు దవాఖానలో చికిత్స కొనసాగుతున్నది. పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు సూచిస్తున్నా.. తల్లిదండ్రుల్లో ఆందోళన వీడడం లేదు. మళ్లీ హాస్టల్‌కు వెళ్లాలంటేనే విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు. గిరిజన హాస్టల్లోకి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన మీడియాను పోలీసులు లోనికి అనుమతించలేదు.