షాద్‌నగర్‌రూరల్, జనవరి 7: ఆంగ్లంపై ప్రతి విద్యా ర్థి పట్టు సాధించాలని ఫరూఖ్‌నగర్ మండలంలోని రాయికల్ ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రిన్స్‌పాల్ విజయలక్ష్మి అన్నారు. క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో శనివా రం విద్యార్థులకు అంగ్ల పోటీలను నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థుల జాబితాను ప్రకటించా రు. అనంతరం బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుం చే ఆంగ్గంపై మంచి పట్టు సాధిస్తే భవిష్యత్ ఉంటుందన్నారు. ఉన్నత చదువులు ఆంగ్లం లో ఉంటాయని విద్యార్థులు ఆంగ్లంలో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఆంగ్ల ఉపాధ్యాయులు రాజేశ్వరి, హస్నవుద్దీన్, క్లబ్ సభ్యులు రాఘవేందర్, లక్ష్మి పాల్గొన్నారు.
మొయినాబాద్ : విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టుపెంచుకోవాలని ఎంఈవో వెంకటయ్య అన్నారు. మండల పరిధిలోని పెద్దమంగళారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఆంగ్ల భాషలో కథలు, పదజాల పోటీలను నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కన్వీనర్ లక్ష్మణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.