షాద్‌నగర్‌రూరల్, సెప్టెంబర్ 2 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలంలోని రాయికల్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్14,17 జోనల్ స్థాయి కబడ్డీ పోటీలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక ప్రశాం తత కలుగుతుందన్నారు. క్రీడా రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదన్నారు. ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీల్లో జిల్లా స్థాయిలో రాణించి షాద్‌నగర్ పట్టణానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. కబడ్డీ పోటీలో అండర్17 బాలుర విభాగంలో ప్రథమ బహుమతిని కేశంపేట, బాలికల విభాగంలో ఫరూఖ్‌నగర్ ద్వితీయ బహుమతులను బాలుర విభాగంలో కొత్తూరు, బాలికల విభాగంలో కేశంపేట విద్యార్థులు సాధించారు. కార్యక్రమం లో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, రాయికల్ సర్పంచ్ కృష్ణయ్య, పీఎస్ఎస్ చైర్మన్ బక్కన్నయాదవ్, నాయకలు వెంకట్‌రెడ్డి, శ్రీనివాసులు, ఎంఈవో శంకర్‌రాథోడ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పూజలు
షాద్‌నగర్‌రూరల్ : ఫరూఖ్‌నగర్ మండలంలోని బూర్గుల గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఎమ్మెల్యే పూజలు చేశారు. ఆధ్యాత్మికతను పెంపొందించుకొని ముందుకు నడవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అరుణ, వైస్ ఎంపీపీ మౌనిక, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ముగిసిన ఎస్జీఎఫ్ క్రీడాపోటీలు..
ఇబ్రహీంపట్నంరూరల్ : నాలుగురోజులుగా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠంలో కొనసాగుతున్న ఎస్జీఎఫ్ అండర్-17. అండర్ 14క్రీడాపోటీలు శనివారం ముగిశాయి. కార్యక్రమానికి ఎంఈవో వెంకట్‌రెడ్డి హాజరై బహుమతులు ప్రదానం చేశారు. ఈ క్రీడల్లో అండర్-17. అండర్-14క్రీడాపోటీల్లో సుమారు 1500 మంది పాల్గొన్నారు. అండర్ -17 బాలికలు మొదటి బహుమతి చర్లపటేల్గూడ్ పాఠశాల, 2వ బహుమతి ఎలిమినేడు పాఠశాల, అండర్-14 మొదటి బహుమతి ఎంజేపీ ఇబ్రహీంపట్నం బాలికలు, రెండవ బహుమతి చింతపట్ల జిల్లా పరిషత్, అండర్ 17 బాలుర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, రెండవ బహుమతి టీఎస్ఎంఎస్ ఆరుట్ల విద్యార్థులు సాధించారు. విద్యార్థులకు టీషర్టులు అందజేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జోనల్ సెక్రటరీ దేదాసు, జయమ్మ, విజేందర్, జగన్మోహన్, ఆరోగ్యం, మహ్మద్ సాబేర్, వెంకటేశ్, రాథోడ్, భాస్కర్, యాదమ్మ, సరిత, నిర్మల, జ్యోతి, అంజి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.