పరిగి, ఫిబ్రవరి 9: రెండేళ్ల కాంగ్రెస్ సర్కారు పై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొందని పరిగి మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ చార్జి ఎం.ఎన్.శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ సర్కారు పూర్తిస్థాయిలో నెర వేర్చలేదన్నారు. ఎన్నికల సమయంలో అలవి కాని హామీలు గుప్పించి అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలును పూర్తిగా మరిచి పోయిందన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ పెంపు, ఒకే ఇంట్లో ఇద్దరికి పింఛన్ అమలు, కల్యాణలక్ష్మీ కింద లక్ష రూపాయలతోపాటు తులం బంగారం, ఆడపడచులకు నెలకు రూ.2500 వంటి అనేక హామీలను కాంగ్రెస్ సర్కారు అటకెక్కిం చిందన్నారు.
దేశానికి వెన్నముకగా నిలిచే రైతాంగానికి రైతుబంధు పథకం కింద ఎక రాకు సంవత్సరానికి రూ.15వేలు ఇస్తామని చెప్పి రెండు పర్యాయాలు ఎగ్గొట్టిందన్నారు. సంవత్సరానికి 2లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తా మని హామీ ఇచ్చి, బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో వేసిన ఉద్యోగ నోటిఫికేషన్లలో ఎంపికైన వారికి కేవలం సర్టిఫికెట్లు అందిం చారని ఆయన ఎద్దేవా చేశారు. జాబ్ క్యాలెం డర్ మాట ఊసెత్తడం లేదన్నారు. ఉద్యోగు లను ఊరించి నిండా ముంచారని విమర్శిం చారు. రిటైర్డ్ అయిన వారికి బెనిఫిట్స్ అందక ఆయా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని తెలిపారు. ప్రతి వర్గం కాం గ్రెస్ నయవంచనకు గురైందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేడు తెలంగాణ సమాజమంతా తిరిగి కేసీఆర్ పాలనను కోరు కుంటున్నారని తెలిపారు.
కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నారని, పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా అభివృద్ది పరుగులు పెట్టిందని పేర్కొన్నారు. ఏ ఒక్క సంక్షేమ పథకంలో రూపాయి అవినీతి లేకుం డా నేరుగా లబ్దిదారులకు పథకాలు అందా యని ఆయన గుర్తు చేశారు. ప్రతి ఇంటింటికి శుద్ధి చేయబడిన తాగునీరు అందించిన ఘన త కేసీఆర్‌కు దక్కుతుందని, నేటి కాంగ్రెస్ సర్కారు మిషన్ భగీరథను సైతం సరిగ్గా నిర్వహించలేకపోతుందని ఆయన దుయ్యబ ట్టారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పరిగిలో అభివృద్ధి కుంటుపడిందని ఆయన విమర్శిం చారు.
మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, పరిగి మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి హార్వర్డ్ యూని వర్సిటీకి వెళ్లి ప్రత్యేక తరగతులకు హాజరైన ప్పటికీ ఆయన బుద్ధి మారలేదన్నారు. సీఎం పీఠంపై కూర్చున్న ఆయనకు హుందాతనం తెలియదని, కేవలం ప్రతిపక్ష నాయకుడిని తిట్టడం ద్వారా డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ప్రజలు కాంగ్రెస్‌ను ఓడించడం ఖాయమ న్నారు. పరిగి మండలంలో నిర్వహించిన సభ లో సీఎం రేవంత్‌రెడ్డి పరిగిలో ఏమి అభివృద్ది చేస్తామన్నది చెప్పకుండా కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకులను తిట్టడం పనిగా పెట్టుకో వడం హాస్యస్పదమన్నారు. కాంగ్రెస్ సర్కా రుపై ప్రజలకు పూర్తిగా భ్రమలు తొలగిపో యాయని ఆయన పేర్కొన్నారు.