శంషాబాద్ రూరల్, ఆగస్టు 4: శంషాబాద్ మండలం మదన్‌పల్లి గ్రామంలో సోమవారం వీధి కుక్కలు స్వైర విహారం చేయడంతో పాటు నలుగురిని తీవ్రంగా గాయపరిచాయి. వివరాలు.. మదన్‌పల్లి గ్రామంలో ఇంటిముందు ఆడుకుంటున్న ఓ బాలుడిపై దాదాపు పదికి పైగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడిచేశాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరిమే ప్రయత్నం చేయగా.. వారిపై కూడా కుక్కలు దాడి చేయడంతో నలుగురికి చేతులు, కాళ్లలకు గాయాలయ్యాయి. బాలుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని దవాఖానకు తరలించారు.