ఇబ్రహీంపట్నం, జనవరి 23 : కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి లో ప్రజలు జిల్లా నలుమూలల నుంచి వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదులు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదులు పరిష్కరించే విషయంలో సం బంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పు డు సమీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రజావాణిలో 40 ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఈ ఫిర్యాదులన్నింటినీ మంగళవారం లోగా సంబంధిత శాఖలకు పంపిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులున్నారు.