ఆమనగల్లు (మాడ్గుల) : మాడ్గుల మండలకేంద్రంలో శివాలయంలో విగ్రహాల పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం కన్నుల పండువగా కొనసాగింది. సోమవారం స్వయంబూ శివాలయం పునఃప్రతిష్టాపన కార్యక్రమం ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో మహాగణపతి, సుబ్రహ్మణ్య, నందీశ్వర వృషధ్వజ విగ్రహాల ప్రతిష్టాపన చేశారు. కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి పాల్గొన్నారు.
మంత్రి ఆలయ అర్చకులు పూర్ణకుంబంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధికి కృషి చేసిన చైర్మన్ సూదిని పద్మారెడ్డిని మంత్రి సత్కరించారు.
మంత్రికి ఘన స్వాగతం..
మండల ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు తరలివచ్చి అవురుపల్లి గ్రామ ముఖద్వారం వద్ద మంత్రి సబితాఇంద్రారెడ్డికి ఘనస్వాగతం పలికారు. శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేశారు. మంత్రి సమక్షంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి ఎంపీటీసీ ఫోరం తరపున వైస్ ఎంపీపీ శంకర్‌నాయక్, ఎంపీటీసీ జైపాల్‌రెడ్డిలు ఎమ్మెల్సీ ఫండ్‌ను ఎంపీటీసీలకు అభివృద్ధి పనులకు కేటాయించాలని విన్నవించారు.
కార్యక్రమంలో ఎంపీపీ పద్మారెడ్డి, వైస్ ఎంపీపీ శంకర్‌నాయక్, మండల అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు రవితేజ, మార్కెట్ డైరెక్టర్ సుభాశ్, నిరంజన్, సర్పంచ్ రమేశ్‌రెడ్డి, అంబాల జంగయ్య, శ్రీను, నాయకులు మాజీ ఎంపీపీ జైపాల్‌నాయక్, లాలయ్యగౌడ్, రాజవర్ధన్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, వరుణ్ పాల్గొన్నారు.