‘ఫాక్స్‌కాన్ పరిశ్రమ రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో ఏర్పాటవుతుండడం గర్వకారణం.. ఐదేండ్లలో ఈ ప్రాంతం ఊహించని రీతిలో అభివృద్ధి చెందనున్నది. కొంగరకలాన్‌కు కొత్తరూపు వచ్చి గుర్తుపట్టలేనంతగా మారడం ఖాయం.. చుట్టుపక్కల ప్రాంతాలూ ఎంత గొప్పగా మారుతాయో మీరే చూస్తరు..’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని కొంగరకలాన్‌లో అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఫాక్స్‌కాన్ కంపెనీ ఏర్పాటుకు మంత్రి సబితారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపనతో పాటు భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఫాక్స్‌కాన్ కంపెనీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 35వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ప్రతి రంగంలోనూ తెలంగాణ ముందంజలో ఉండి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. ‘మనకు కొలువుల తెలంగాణ కావాలి.. మత పిచ్చి తెలంగాణ వద్దు’ అని మంత్రి నినదించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రంగారెడ్డి, మే 15 (నమస్తే తెలంగాణ): తైవాన్‌కు చెందిన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ టెక్నాలజీస్ రంగారెడ్డి జిల్లాకు రావడం చాలా గర్వంగా ఉందని.. ఈ కంపెనీ ఏర్పాటుతో స్థానికంగా వేలాది మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఆయన ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ కంపెనీ ఏర్పాటుకు మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, కంపెనీ చైర్మన్‌తో కలిసి శంకుస్థాపనతోపాటు భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఫాక్స్‌కాన్ రంగారెడ్డి జిల్లాకు రావడం మనందరికీ గర్వకారణమని.. ఈ కంపెనీ ఏర్పాటుతో జిల్లా రూపురేఖలే మారుతాయన్నారు. రానున్న ఐదేండ్లలో కొంగరకలాన్ గుర్తు పట్టలేని విధంగా మారనున్నదని.. రూ.నాలుగు వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న కంపెనీతో స్థానికంగా 35 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి అన్నారు. మన చేరువలోకి వచ్చిన పరిశ్రమలను కాపాడుకోవాలని సూచించారు. స్థానిక యువతీయువకులతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ఫాక్స్‌కాన్ యాజమాన్యం హామీ ఇచ్చినట్లు తెలిపారు. పరిశ్రమ నిర్మాణం జరుగుతుంటే మరోవైపు యువతకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నట్లు చెప్పారు. యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ కంపెనీ కోసం ప్రభుత్వం రంగారెడ్డి కలెక్టరేట్ సమీపంలోని సర్వేనంబర్ 300లో 196 ఎకరాల భూమిని కేటాయించింది.
గత తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నదని మం త్రి కేటీఆర్ తెలిపారు. సబ్బండ వర్ణాలకు సంక్షేమ, అభివృ ద్ధి పథకాలు అందుతున్నాయని.. రాష్ట్రంలో సంక్షేమ పథ కం అందని ఇల్లు అంటూ లేదని పేర్కొన్నారు. అభివృద్ధిలో రాష్ట్రం దేశానికే మాడల్‌గా నిలిచిందని.. మన పథకాలను ఇతర రాష్ర్టాల పాలకులు కాపీ కొడుతున్నారన్నారు. చిన్న రాష్ట్రమైనా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 26 అవార్డులను తెలంగాణ సాధించిందని ఆయన గుర్తు చేశారు. ఓ వైపు ఐటీ, మరో వైపు వ్యవసాయ రంగాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఐటీ రంగంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానం లో ఉందన్నారు. నల్లాలద్వారా ఇంటింటికీ తాగునీటిని అందించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ ప్రసిద్ధి చెందిందన్నారు.
రానున్న రోజుల్లో హైటెక్‌సిటీని మించి రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్ గ్రామం అభివృద్ధి చెందడం ఖాయమని మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఫాక్స్‌కాన్ కంపెనీ జిల్లాకు రావడానికి కారకులైన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు జిల్లా ప్రజల తరఫున ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామ రక్ష అని.. ఆయన అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మనమంతా అండగా నిలుద్దామని మంత్రి సభాముఖంగా కోరారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కమిట్మెంట్ ఉన్న నేత అని.. ఆయన కృషితోనే రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని కొనియాడారు. ఇప్పటికే పలు పరిశ్రమలు రాగా.. నేడు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఫాక్స్‌కాన్ కంపెనీ కూడా మన జిల్లాకు వచ్చిందని.. ఈ కంపెనీ ద్వారా వేలాది మంది స్థానిక యువతీయువకు లకు ఉపాధి దొరుకుతుందన్నారు.
మనకు కొలువుల తెలంగాణ కావాలి కానీ.. మత పిచ్చి తెలంగాణ వద్దని మంత్రి కేటీఆర్ బహిరంగ సభలో నినదించారు. విదేశాల నుంచి పెట్టుబడులు రావడం వల్ల స్థానికంగా పరిశ్రమలు వెలుస్తుండటంతో స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయన్నారు. ఐదేండ్ల తరువాత కొం గరకలాన్ గుర్తు పట్టలేనంతగా మారుతుందన్నారు. నటు డు రజనీకాంత్ హైదరాబాద్ నగరం అమెరికాలోని న్యూ యార్క్‌ను తలపిస్తున్నదని పేర్కొన్నట్లు మంత్రి గుర్తు చేసుకున్నారు. స్థానిక నిరుద్యోగులు, యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జడ్పీచైర్ పర్సన్ అనితారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యడు వంగేటి లక్ష్మారెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి, వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్త య్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకట రమణారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర యువనాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆదిబట్ల, మే 15 : భవిష్యత్తులో నియోజకవర్గ రూపురేఖలు మారనున్నాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం కొంగరకలాన్ వద్ద ఫాక్స్‌కాన్ కంపెనీ భూమిపూజా కార్యక్రమం అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధిని సాధించిందన్నారు. ఎన్నో ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటైనట్లు తెలిపారు. త్వరలోనే ఎలిమినేడు గ్రామంలో ఏరోస్పేస్, బలిజగూడలో కార్ల తయారీ పరిశ్రమ, ఆదిబట్లలో ఎల్ఎంటీ సంస్థ ఆధ్వర్యంలో పలు పరిశ్రమలు ఏర్పాటు కానున్నట్లు, దీంతో వేలాది మంది స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయన్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన భూములు ఎన్నో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువనాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీపీలు కృపేశ్, నర్మద, జడ్పీటీసీ జంగమ్మ, మార్కెట్‌కమిటీ చైర్మన్ చంద్రయ్య, వైస్ చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఆదిబట్ల వైస్ చైర్మన్ కళమ్మ, గోపాల్‌గౌడ్, కౌన్సిలర్లు, మండల పార్ట్టీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి