నేటి నుంచి క్రీడామహోత్సవం
మండల వ్యాప్తంగా ప్రతిభ గల క్రీడాకారులను వెలికి తీయడమే లక్ష్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రీడామహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ బాలేశ్వర గుప్తా తెలిపారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న ఈ పోటీను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు
- మూడు రోజుల పాటు ఆటల సందడి
- హాజరు కానున్న మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
యాలాల, డిసెంబర్ 28: మండల వ్యాప్తంగా ప్రతిభ గల క్రీడాకారులను వెలికి తీయడమే లక్ష్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రీడామహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ బాలేశ్వర గుప్తా తెలిపారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న ఈ పోటీను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం మండల పరిధిలోని పీడీ, పీఈటీ ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా పోటీల ప్రారంభించిన అనంతరం మంత్రి, ఎమ్మెల్యే కేజీబీవీ కళా శాల అదనపు గదులను, రైతువేదికను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాగా 6 నుంచి 8 తరగతి విద్యార్థులను జూనియర్లుగా 9, 10 తరగతి విద్యార్థులను సీనియర్లుగా పరిగణించి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, లాంగ్‌జంప్, షాట్‌ఫుట్, రన్నింగ్, డిస్కస్‌త్రో, జావలిన్‌త్రో, క్యారమ్స్, చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం క్రీడల నిర్వహణకు గ్రౌండ్‌ను పరిశీలించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

