షాద్‌నగర్‌టౌన్, జనవరి 7 : కేంద్ర ప్రభుత్వం కేంద్ర వయోజన, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో హిమాచల్‌ప్రదేశ్ జార్ఖండ్‌లో సాహస క్రీడలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం షాద్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, పాలమూరు విశ్వవిద్యాలయ పరిధిలోని ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రెస్క్యూటీం శిక్షణలో పాల్గొన్నారని (నేషనల్ అడ్వెంచర్ క్యాంపు) కంటింజెంట్ లీడర్ షాద్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సామ రవీందర్‌రెడ్డి తెలిపారు.
రెస్క్యూటీం శిక్షణ ద్వారా ఆపద సమయాల్లో ఎలా స్పందించాలి, ఏ విధంగా కాపాడాలో తెలుస్తుందన్నారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఆ ప్రదేశం నుంచి గాయపడ్డ వారిని ఎలా తీసుకురావాలి, అత్యవసరాల్లో గాయపడిన వ్యక్తులను స్ట్రెచర్‌తో ఏ విధంగా కాపాడాలో, తాళ్లతో స్ట్రెచర్ తయారు చేసే విధానంపై శిక్షణ ఇచ్చారని తెలిపారు. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేస్తున్న కంటింజెంట్ లీడర్, విద్యార్థులను ట్రెక్కింగ్ నిర్వాహకులు, ఎన్ఎస్ఎస్ రీజినల్ డైరెక్టర్ రామకృష్ణ, యూనివర్సిటీ కో-ఆర్డినేటర్ ప్రవీణ్ అభినందించారు.