కొత్తూరు, ఏప్రిల్ 6: రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. అందులో భాగంగా నియోజకర్గంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య ఆధ్వర్యంలో రూ. 1.76 కోట్లతో కొత్తూరు నుంచి కుమ్మరిగూడకు వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ప్రతి గ్రామానికి నాణ్యమైన రోడ్డు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అయితే కొత్తూరు నుంచి కుమ్మరిగూడ వరకు లోతట్టు ప్రాంతం ఉండటం వల్ల సీసీ రోడ్డును నిర్మిస్తేనే మన్నికగా ఉంటదని అందుల్లే సీపీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. అయితే కుమ్మరిగూడకు సీసీ రోడ్డు రావాలని ఆ ప్రాంత ప్రజలు ఎన్నో ఏండ్లుగా కోరుకుంటున్నారని చెప్పారు. వారి కల నేటికి సాకారం అయిందన్నారు. రోడ్డును సాధ్యమయినంత త్వరగా మన్నికతో నిర్మించాలని కాంట్రాక్టర్‌కు ఎమ్మెల్యే సూచించారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, ఎంపీటీసీ రాజేందర్‌గౌడ్, కౌన్సిలర్లు కొస్గి శ్రీనివాసులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవేందర్‌యాదవ్, తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ ఏనుగు జనార్దన్‌రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు జంగగళ్ల శివకుమార్, బీసీ సెల్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, పాల్గొన్నారు.