పరిగి, అక్టోబర్ 28 : కార్తీక సోమవారం పర్వదినం సందర్భంగా అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట సందర్శనకు పరిగి డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసు నడిపించడం జరుగుతుందని డిపో మేనేజర్ కె.కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేకమైన అధునాతన డీలక్స్ బస్సు నడిపించనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 2వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు పరిగి నుంచి బయలుదేరి 3వ తేదీన అమరావతి అమరలింగేశ్వర స్వామి, భీమవరం సోమేశ్వర స్వామి, రాజరాజేశ్వరి, పాలకొల్లు రామలింగేశ్వర స్వామి పార్వతీదేవి, ద్రాక్షారామం భీమేశ్వర స్వామి మాణిక్యాంబ, సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి బాల త్రిపుర సుందరి దేవాలయాలను దర్శించుకొని 3వ తేదీ రాత్రి 9 గంటలకు బయలుదేరి 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు పరిగి చేరుకుంటుందని తెలిపారు.
30 మంది ప్రయాణీకులుంటే ఆయా గ్రామం, కాలనీ నుంచి బస్సు నడపించడం జరుగుతుందన్నారు. టికెట్ ధర ఒక్కరికి రూ.2500 నిర్ణయించడం జరిగిందని, రిజర్వేషన్ చార్జీలు అదనంగా చెల్లించి టికెట్ బుక్ చేసుకోవాలన్నారు. వివరాలకు ఫోన్ నెంబర్లు 9490215648, 9440313917, 7569065644లలో సంప్రదించాల్సిందిగా ఆయన సూచించారు.