నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిచేస్తాం
వికారాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తానని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. గురువారం మర్పల్లిలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సభాపతి హాజరయ్యారు.
- శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్
- లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
మర్పల్లి, జనవరి 4 : వికారాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తానని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. గురువారం మర్పల్లిలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సభాపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
ప్రజాపాలన కార్యక్రమంలో సాధ్యమైనంత వరకు అర్హులైన ప్రతిఒక్కరూ ఆరో తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని, ప్రస్తుతం అందుబాటులో లేనివారికి తిరిగి నాలుగు నెలల తర్వాత దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. లబ్ధిదారులకు నష్టం వాటిల్లకుండా గత ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ 98 చెక్కులను అందజేశారు. భవిష్యత్తులో రూ.లక్షా116లతో పాటు తులం బంగారం లేదా రూ.లక్షాఅరవైవేల చెక్కులను అందజేయనున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాలు ప్రతి పేద ఇంటికీ చేరేలా అమలుచేస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డు లేనివారు కూడా ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
రోడ్ల నిర్మాణ పనులకు రూ.300 కోట్లు
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేపడుతామని, రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి ఎకరానికి రూ.15 వేల రూపాయల చొప్పున అందిస్తామని తెలిపారు. రైతు భరోసా పథకం కౌలు రైతులకు కూడా వర్తిస్తుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో పాటు సంక్షేమ పథకాలను తప్పనిసరిగా అందించే బాధ్యత తనపై ఉందని ఆయన పేర్కొన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలోని రోడ్ల ఏర్పాటుకు 300 కోట్లు నిధులను కేటాయించనున్నట్లు తెలిపారు.
అదనంగా రోడ్ల నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వానికి రూ.150 కోట్లు మంజూరుకై ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ప్రజా పాలన గ్రామసభ అనంతరం కల్యాణలక్ష్మి , షాదీముబారక్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో విజయకుమారి, డీఎల్పీవో అనిత, తహసీల్దార్ గణేశ్, ఎంపీడీవో అనిత, ఎంపీపీ లలిత, జడ్పీటీసీ మధుకర్, సర్పంచ్ మహబూబాబీ, ఎంపీటీసీ సంగీత, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ కొండల్‌రెడ్డి, నాయకులు రవీందర్, రాములు యాదవ్, ఖలీమొద్దీన్, ఫసియోద్దీన్, రమేశ్వర్, సురేశ్, శేఖర్ యాదవ్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

