మర్పల్లి, జూన్ 24 : ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలని, లేదంటే చర్యలు తప్పవని శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన మండలంలోని పట్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలోని గదులు, రికార్డులను పరి శీలించారు. ఇక్కడ ఎంత మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని ఆరా తీశారు.
డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో డీఎంహెచ్‌వోకు ఫోన్ చేస్తే లిఫ్టు చేయకపోవ డంతో కలెక్టర్‌కు ఫోన్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట రాష్ట్ర నాయకుడు రాములు యాదవ్, ఎంపీటీసీలు స్వప్నాసురేశ్, మహేశ్, మాజీ సర్పంచ్ సురేశ్‌యాదవ్, సురేశ్‌కుమార్, సాయిపటేల్, నందుప్రకాశ్ పాల్గొన్నారు.