వికారాబాద్, ఫిబ్రవరి 17 : సుమారు పది లక్షల విలువైన నకిలీ విత్తనాలను జిల్లా టాస్క్‌ఫోర్స్, పెద్దేముల్ పోలీసు లు పట్టుకున్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వికారాబాద్ ఎస్పీ నారా యణరెడ్డి వివరాలు వెల్లడించారు. జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ ప్రశాంత్వర్ధ న్, టాస్క్‌ఫోర్స్ బృందం, పెద్దేముల్ పోలీసులు, పెద్దేముల్ వ్యవసాయాధికారి కలిసి.. ఈ నెల 16న పెద్దేముల్ అంబేద్కర్ విగ్రహం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని తనిఖీ చేయగా.. అతడి వద్ద నాలుగు ప్లాస్టిక్ సంచుల్లో ఎలాంటి లేబుల్స్, లాట్‌నంబర్, బ్యాచ్‌నంబర్ లేని.. తుది గడువు లేని పత్తి విత్తనాల ప్యాకెట్లు కనిపించాయి.
వాటిని వ్యవసాయాధికారి పరిశీలించి నకిలీవిగా నిర్ధారించారు. దీం తో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఏపీలోని బాపట్ల జిల్లా కోనంకి గ్రామానికి చెం దిన ఉప్పలపాటి వసంత్రావుగా గుర్తించారు. అతను గత 15 ఏండ్లు గా కర్ణాటకలోని గాజుర్కోట్ గ్రామం లో జీవిస్తున్నాడని..అతడు అక్కడి నుంచి నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించేందుకు పెద్దేముల్‌కు వచ్చాడని తెలిపారు. సీజన్లో వాటిని అమ్మాలం టే అధికారులు, పోలీసుల నిఘా అధికం గా ఉండడంతో.. ఇప్పుడు అమ్మితే ఎవరికీ అనుమానం రాదని భావించి.. రైతులకు అధిక ధరలకు అమ్ముతున్నట్లు తెలిపారు.
నాలుగు సంచుల్లో సుమారు రూ. 2.70 లక్షల విలువ కలిగిన 150 కేజీల నకిలీ పత్తి విత్తనాలను పంచనామా నిర్వహించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం టాస్క్‌ఫోర్స్ అధికారులు, పెద్దేముల్ పోలీసులు నిందితుడు నివసిస్తున్న కర్ణాటకకు వెళ్లి అక్కడ సుమా రు రూ. 7.20 లక్షల విలువ కలిగిన 4 క్విం టాళ్ల్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకుని..నిందితుడిపై పెద్దేముల్ ఠాణాలో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అతడిపై బషీరాబాద్ ఠాణాలోనూ గతం లో నకిలీ పత్తి విత్తనాల కేసు నమోదైందని ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. సమావేశంలో కరణ్‌కోట్ ఇన్స్పెక్టర్ నగేశ్, పెద్దేముల్ ఎస్ఐ శ్రీధర్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ ప్రశాంత్‌వర్ధన్ , సిబ్బందిని ఎస్పీ అభినందించారు.