Life Imprisonment | షాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): తండ్రిని చంపిన కొడుకుకి జీవిత ఖైదీ శిక్ష పడింది. షాబాద్ సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం షాబాద్ మండలం దామరపల్లి గ్రామ నివాసి బోకుల వెంకటేష్ 2022లో మద్యం తాగిన మత్తులో తన తండ్రిని హత్య చేశాడు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. గురువారం ఎల్బీనగర్ కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడికి జీవిత ఖైదీతో పాటు రూ.2,000జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు సీఐ తెలిపారు.