న్యూస్‌నెట్‌వర్క్, నమస్తే తెలంగాణ ;ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను మంచు ముంచెత్తున్నది. గత కొన్ని రోజులుగా దట్టమైన పొగమంచు కురుస్తుండడంతో ఉదయం సమయంలో మనుషులు, రోడ్లు సైతం కనిపించడంలేదు. ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా పొగమంచు కమ్మేస్తున్నది. పొగమంచులో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారితోపాటు ఉమ్మడి జిల్లాలోని పలు రోడ్లపై వెళ్లే వాహనాల డ్రైవర్లు ఎదురుగా ఏమి కనిపించకపోవడంతో లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. మరికొందరు తమ వాహనాలను రోడ్డు పక్కన నిలుపుకొని మంచు పూర్తిగా తగ్గిన తర్వాత వెళ్తున్నారు. పొగమంచులో భానుడు చంద్రుడిలా కనిపిస్తున్నాడు. ఉదయం, సాయంత్రం సమయాల్లో చల్ల గాలులు వణికిస్తుండడంతో ప్రజలు బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. గ్రామాల్లోని ప్రజలు చలిని తట్టుకునేందుకు ఉదయం చలిమంటలు వేసుకుంటున్నారు. –