కడ్తాల్, జనవరి 10 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోను రాణించాలని ఎస్ఐ హరిశంకర్‌గౌడ్, కర్కల్‌పహాడ్ ఎంపీటీసీ పాత్లావత్ లచ్చిరాంనాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని వాసుదేవ్పూర్ గ్రామంలో నిర్వహించిన వీపీఎల్-3 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ హరిశంకర్‌గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు అంతే ముఖ్యమన్నారు. క్రీడలతో స్నేహబంధాలు పెంపొందుతాయన్నారు. మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లచ్చిరాంనాయక్, ఏఎస్ఐ సీతారాంరెడ్డి, మాజీ సర్పంచ్ నంద్యానాయక్, నాయకులు మోహన్‌నాయక్, శ్రీనూనాయక్, మల్లేశ్, సుమన్, రామకృష్ణ, కాన్షీరాం, రమేశ్, హరికిషన్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
షాబాద్ : నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో షాబాద్ మండలంలోని కక్కులూర్ గ్రామంలో నిర్వహించిన వాలీబాల్, కబడ్డీ పోటీలు విజయవంతంగా ముగిశాయి. మంగళవారం విజేతలకు యువ కేంద్రం మండల కో-ఆర్డినేటర్ దాదే మహేశ్ బహుమతులు అందజేశారు. వాలీబాల్ పోటీల్లో మొత్తం 16 జట్లు పాల్గొనగా, కబడ్డీలో 8 జట్లు పాల్గొన్నాయి. వీరిలో వాలీబాల్ పోటీల్లో మొదటి బహుమతి కక్కులూర్, రెండవ బహుమతి అంతారం జట్లు దక్కించుకున్నాయి. కబడ్డీ పోటీల్లో మొదటి బహుమతి కుర్వగూడ జట్టు, రెండవ బహుమతి కక్కులూర్ జట్టుకు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ భానూరి మమతారెడ్డి, ఎంపీటీసీ కరుణాకర్, మాజీ ఎంపీటీసీ జీవన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ఉప సర్పంచ్ నర్సింహులు, పీఈటీలు రవీందర్, ఆంజనేయులు, వార్డుసభ్యులు యాదగిరి, నర్సింహులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
నందిగామ: నందిగామ మండలం మేకగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌ను మంగళవారం సర్పంచ్ పాండురంగారెడ్డి, పీఏసీఎస్ చైర్ పర్సన్ మంజులరెడ్డి, ఎంపీటీసీ రాజూనాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నోముల పద్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఐదు రోజుల పాటు టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్స్ ప్రవీణ్, లింగం, రాజేశ్ తెలిపారు. కార్యక్రమంలో గోపాల్‌రెడ్డి, రాజు, శ్రీను, వెంకటేశ్, శ్రీశైలం, నర్సింహులు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.