Shadnagar : రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం..
రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా

షాద్‌నగర్ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా అన్నారు. శనివారం షాద్‌నగర్ పట్టణంలోని శ్రీవాసవి కన్యాకపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలో నానాటికి పర్యాటక రంగం ప్రగతి సాధిస్తూ వస్తుందని, మన ప్రాంతంలోని పేరుగాంచిన దేవాలయాలు, దర్శనీయ ప్రదేశాలను, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే జలపాతలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా అన్ని వర్గాల ప్రజలు హరితహారాన్ని విజయంతం చేయాలని, అనువైన ప్రతి చోట మొక్కలను పెంచాలని పిలుపునిచ్చారు.
ఇందులో భాగంగానే దేవాలయం ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు రమేశ్, సరాపు అనంతలక్ష్మీ, సుర్యనారాయణ, ప్రకాష్, పాండురంగయ్య, శ్రీనివాస్ గుప్తా, బాదం మాధవి, రజిత, మాణిక్యం, జగదీశ్వర్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

