షాద్నగర్ : టీఆర్ఎస్ ఆవిర్భావించి 20ఏండ్లు పూర్తి కావడాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 15న వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే టీఆర్ఎస్ విజయగర్జన సభను విజయవంతం చేసేందుకు షాద్నగర్ నియోజకవర్గ గులాబీ దండు కదలాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే బుధవారం షాద్నగర్ పట్టణంలోని కింగ్ఫ్యాలెస్ ఫంక్షన్హాల్లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించి సభను విజయవంతం చేసేందుకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజల మన్నలను అందుకున్న పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఎదిగిందని, నేటి పరిస్థితుల్లో ప్రజలకు భరోసాను కల్పిస్తున్న ఏకైక పార్టీగా టీఆర్ఎస్ ఎదిగిందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కోరారు. విజయగర్జన సభను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కదలిరావాలని, ప్రతి గ్రామాన్ని వాహన సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, శ్రీలత, ఎంపీపీ రవీందర్యాదవ్, ఖాజా ఇద్రీస్ ఆహ్మాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.