షాద్నగర్ : పారిశుధ్య నిర్వహణ మనందరి బాధ్యత అనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. శనివారం షాద్నగర్ పట్టణంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు స్వచ్ఛభారత్ ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణలో మున్సిపల్ కార్మికులు సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. పట్టణ సుందరీకరణలో భాగంగా సామన్య ప్రజలు సహితం బాధ్యత యుతంగా మెలుగాలని, ఎట్టి పరిస్థితిలో చెత్తను ఇష్టానుసారంగా పడేయకూడదని చెప్పారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే అంటురోగాలు దరిచేరవని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, కమిషనర్ లావణ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.