షాద్‌నగర్‌టౌన్, అక్టోబర్ 20 : తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గడపగడపకూ చేరుతున్నాయని షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. మున్సిపాలిటీలోని 23,24,25వ వార్డుల్లో కౌన్సిలర్లు, నాయకులతో కలిసి శుక్రవారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజన్న గెలుపునకు కృషి చేస్తామని ప్రజల నుంచి మద్దతు వస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ విశ్వం, ఎంపీటీసీ రామకృష్ణ, కౌన్సిలర్లు నందీశ్వర్, శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, నర్సింహులు, నాయకులు యుగేందర్, భిక్షపతి, రాఘవేందర్, చెన్నయ్య, సుధాకర్, రమేష్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.