GT vs MI : పంతొమ్మిదో సీజన్లో విఫలమవుతున్న ముంబై ఇండియన్స్, జోరు మీదున్న గుజరాత్ టైటన్స్‌ను ఢీ కొడుతోంది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇరుజట్లు గెలుపుపై కన్నేశాయి. టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్ ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తమ తుది జట్టు గురించి మాట్లాడిన హార్దిక్ పాండ్యా ఇద్దరు కుర్రాళ్లు అరంగేట్రం చేస్తున్నారని చెప్పాడు.
వరస విజయాలతో జోరందుకున్న గుజరాత్ ఏ మార్పులు లేకుండా ఆడుతోంది. టాస్ ఓడిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్లో భారీ మార్పులు చేసింది. డాషింగ్ ఓపెనర్లు రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్కు తుది జట్టులో చోటు దక్కలేదు. వీరిద్దరి స్థానంలో గత మ్యాచ్ సెంచరీ హీరో డికాక్, డానిష్ మలేవర్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు.
One side riding high, the other looking to bounce back 👊
Who are you backing tonight? 🧐#TATAIPL | #KhelBindaas | #GTvMI | @gujarat_titans | @mipaltan pic.twitter.com/PdY1NbCLAl
— IndianPremierLeague (@IPL) April 20, 2026
గుజరాత్ టైటన్స్ తుది జట్టు : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్, సుందర్, ఫిలిప్స్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, సిరాజ్, రబడ, ప్రసిధ్ కృష్ణ, అశోక్ శర్మ.
ఇంప్యాక్ట్ సబ్స్ – రాహుల్ తెవాటియా, హోల్డర్, మానవ్ సుతార్, కుల్వంత్ ఖెజ్రోలియా, అనుజ్ రావత్.
ముంబై ఇండియన్స్ తుది జట్టు : డానిశ్ మలేవర్, డికాక్(వికెట్ కీపర్), నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), తిలక్ వర్మ, రూథర్‌ఫోర్డ్, శాంట్నర్, క్రిష్ భగత్, బుమ్రా, గజన్ఫర్.
ఇంప్యాక్ట్ సబ్స్ – రాజ్ బవ, అశ్వనీ కుమార్, కార్బిన్ బాస్చ్, మయాంక్ రావత్, రఘు శర్మ.