Lakshmi Nissan : ప్రముఖ కార్ల కంపెనీ నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెల్ హైదరాబాద్‌లో మరో శాఖను ప్రారంభించింది. కుషాయిగూడ సమీపంలోని ఈసీఐఎల్‌లో సోమవారం ‘లక్ష్మీ నిస్సాన్'(Lakshmi Nissan) ఔట్‌లెట్‌ను తెరిచింది. రాజధాని వ్యాప్తంగా తమ వినియోగారులకు మెరుగైన సేవలు, మరిన్ని సౌకర్యాల కల్పించాలనే ఉద్దేశంతో ఈ శాఖను ఆరంభించినట్టు నిస్సాన్ ప్రతినిధులు వెల్లడించారు.
ఈసీఐఎల్‌లో లక్ష్మీ నిస్సాన్ ఔట్లెట్ ప్రారంభం సందర్భంగా నిస్సాన్ మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ వత్స మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈసీఐఎల్ పరిధిలో మా షోరూం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంతంలో నిస్సాన్ బ్రాండ్ కార్లకు చాలా డిమాండ్ ఉంది. కంపెనీ పరంగా మెరుగైన పురోగతి సాధిస్తామనే నమ్మకం మాకుంది.
దేశవ్యాప్తంగా మా కంపెనీ ఉత్పత్తులను విస్తరించాలనే ప్రణాళికల్లో భాగంగా.. మా వినియోగదారులకు మరింత చేరువగా ఉండాలనే ఉద్దేశంతో, వారికి ఏ ఆటంకం లేకుండా మెరుగైన అనుభవాన్ని కల్పించాలని అనుకుంటున్నాం. ఇటీవలే ఆవిష్కరించిన నిస్సాన్ గ్రావిటేకు కూడా త్వరలోనే మార్కెట్లోకి తీసుకొస్తాం. నిస్సాన్ నెట్‌వర్క్‌ను విస్తరించాలనేది మా వ్యూహాత్మక విధానాల్లో ఒకటి’ అని వెల్లడించారు.

అనంతరం లక్ష్మీ నిస్సాన్ డీలర్ కే. జై రామ్ మాట్లాడుతూ ఈసీఐఎల్‌లో నిస్సాన్ ఇండియా భాగస్వామ్యంతో నిస్సాన్ బ్రాండ్‌ను తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ‘మా వినియోగదారులకు ప్రపంచస్థాయి అనుభవం కల్పించేందుకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పడానికి ఈ షోరూం ఒక నిదర్శనం. కస్టమర్లకే తొలి ప్రాధాన్యం అనే సంకల్సంతో.. అన్ని రకాల నిస్సాన్ కార్లు, పలు సేవలతో పాటు ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని షోరూంను తీర్చిదిద్దాం.
భారత మార్కెట్లో నిస్సాన్ విస్తరిస్తున్న ఈ సమయంలో ఈసీఐఎల్‌లో ఔట్లెట్ ఏర్పాటు చేశాం. ఇందుకు కొత్తగా తీసుకొచ్చిన నిస్సాన్ మ్యాగ్నెట్ కారుకు లభించిన విశేష ఆదరణ కూడా ఒక కారణం. నిస్సాన్ గ్రావిటేను ఆవిష్కరించడం కూడా ప్రధాన ప్రాంతాల్లో నిస్సాన్ బ్రాండ్ అమ్మకాలకు దోహదపడింది. ఈసీఐఎల్‌లో షోరూం ఏర్పాటు చేయడం ద్వారా డీలర్ల పురోగతికి స్థిరమైన పెట్టుబడులు, వినియోగదారులకు ఉపయుక్తమైన సేవలు అందిచాలనే మా దీర్ఘ కాల లక్ష్యం నెరవేరనుంది. మరిన్ని వివరాల కోసం కంపెనీ వెబ్సైట్ www.nissan.in ను సంప్రదించాల’ని జై రామ్ పేర్కొన్నారు.
4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన కొత్త షోరూంను నాలుగు కార్లను ప్రదర్శించడానికి వీలుగా, నిస్సాన్ ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. లక్ష్మీ నిస్సాన్ షోరూం అన్ని వసతులు, సౌకర్యాలతో స్వాగతం పలుకుతుంది. ఇక్కడి సుశిక్షితులైన వర్కర్లు, అంకితభావంతో పనిచేసే మా బృందం వినియోగదారులకు సేవలందించనుంది.