కొత్తూరు, జనవరి 18 : జహంగీర్‌పీర్ దర్గా గంధోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్‌రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఊరేగింపుగా తీసుకెళ్లి దర్గాకు గంధాన్ని సమర్పించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జేపీ దర్గా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ దర్గాకు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తే కోర్కెలు నెరవేరుతాయన్నారు.
అందుకే ప్రతిఏటా వేలాదిగా భక్తులు వచ్చి తమ మొక్కు లను చెల్లించుకుని కందూర్లు చేస్తారన్నారు. దర్గా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభు త్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశా రు. దర్గాను నమ్ముకొని ఎంతోమంది పేద వ్యాపారులు నివసిస్తున్నారని.. వారందరినీ దృష్టిలో ఉంచుకొని దర్గా మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తామన్నారు. దర్గా ఉర్సు సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మూడు వైపులా వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టారు. దర్గాను సందర్శించిన వారిలో మాజీ ఎమ్మె ల్యే ప్రతాప్‌రెడ్డి, వక్ఫ్‌బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ అమీద్ అహ్మద్, మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్‌రెడ్డి, రవిగుప్తా, రషీద్, దర్గా సూపరింటెండెంట్ అబ్దుల్ సత్తార్ పాల్గొన్నారు.