షాద్‌నగర్‌టౌన్, జనవరి 3: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని షాద్‌నగర్ డిప్యూటీ డీఎంహెచ్‌వో జయలక్ష్మి వైద్యులకు సూచించారు. షాద్‌నగర్ డివిజన్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధుల్లో చేరిన వైద్యులతో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎప్పటికప్పుడూ వైద్యులు అందుబాటులో ఉంటారని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందించే వైద్య సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
డివిజన్లోని నందిగామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌గా తులసి, కొత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌గా హరికిషన్, కొందుర్గు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌గా తబసమ్, కేశంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లుగా ఆనమ్నిజామ్, నిఖిత, ఫరూఖ్‌నగర్ మండలం చించోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌గా స్రవంతి విధుల్లో చేరారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.