షాద్‌నగర్ : దేశ ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ప్రజలపై ప్రేమలేదనే విషయం పార్లమెంట్లో ఆయన చేసిన వాఖ్యలతో తెలిసిపోయింది. తెలంగాణ అంటే ఎందుకు అంత అక్కసో ఆయనకే తెలియాలి. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని ప్రచారం చేసిన నాయకుడే తెలంగాణ బిల్లుపై అర్థరహిత వ్యాఖ్యలు చేయడం బాధకరమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్లో దేశ ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ రాష్ట్ర విభజనపై చేసిన వాఖ్యలకు నిరసనగా బుధవారం షాద్‌నగర్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపారు.
ఇందులో భాగంగానే దరిగూడ మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జిలను ధరించి నిరసనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ పార్లమెంట్ నిబందనల ప్రకారం.. ఓటింగ్ నిర్వహించే సమయంలో ధర్వాజాలు ముసివేస్తారని, ఎదైనా గంధరగోలం ఏర్పడే అవకాశం ఉంటే ముందుగానే ఫర్ అగినేస్ట్ అభిప్రాయం ప్రకారం.. కౌంటింగ్ నిర్వహించి బిల్లుకు ఆమోదం తెలుపుతారనే విషయం దేశ ప్రధాని మోదీకి తెలువదా? అని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపిన కొన్ని నేలల్లోపే ప్రధానిగా ఎన్నికైనా ఆయన బిల్లుపై సందేహలు ఉంటే అప్పుడే స్పందించి ఉండవచ్చుకదా.. అని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిది యేండ్ల అనంతరం సమాఖ్య స్ఫూర్తి పేరుతో మాటల గారడి చేస్తు అర్థం లేని వాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయకమునుపే రాత్రికి రాత్రే తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రలో కలపడం ఏ సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనమో చెప్పాలని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేసిన మీరు నగర అభివృద్ధిని మర్చిపోయి, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇరు రాష్ట్రాల ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. అదే విధంగా షాద్‌నగర్ పట్టణ ముఖ్య కూడలిలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, కేశంపేట మండల కేంద్రంలో ఎంపీపీ రవీందర్‌యాదవ్, కొందుర్గు మండల కేంద్రంలో పీఏసీఎస్ చైర్మన్ దామోదర్‌రెడ్డి, కొత్తూరు మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్యయాదవ్, నందిగామ మండల కేంద్రంలో సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లెల వెంకట్‌రెడ్డిల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు నిరసనలు తెలిపి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
తెలంగాణ ప్రజలకు క్షమాపనలు చెప్పాలని ప్రధానిని డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, నాయకులు విశ్వం, యుగేందర్, ప్రతాప్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, శరత్, రామకృష్ణ, రాఘవేందర్, రవీందర్‌రెడ్డి, దేవేందర్‌యాదవ్, యాదగిరి, మాధవరెడ్డి, రమేశ్, శేఖర్‌పంతులు, ప్రేమ్‌కుమార్, శ్రీశైలం, మురళీమోహన్ పాల్గొన్నారు.