Shabad Murders | హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన రంగారెడ్డి జిల్లా షాబాద్ (Shabad) షాబాద్ హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ మృతి చెందాడు. కొత్తూరు మండలం పంజర్లలో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. రాజ్‌కుమార్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారమందించారు. స్థానికులు రాజ్ కుమార్ మృతదేహం దగ్గర పాయిజన్ బాటిల్‌ను గుర్తించారు. రాజ్ కుమార్ మేనమామ ఊరిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
షాబాద్‌లో రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురుని నరహంతకుడు రాజ్‌కుమార్ (Rajkumar) వరుసగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. ఈ మారణహోమాన్ని సృష్టించిన రాజ్ కుమార్ ఆచూకీ కోసం పోలీసులు ఇప్పటికే ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని తెలిసిందే. మరోవైపు నిందితుడిని పట్టిస్టే రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా ప్రకటించారు.
పోక్సో కేసులో బెయిల్ పొంది యథేచ్ఛగా తిరుగుతున్న రాజ్‌కుమార్ పగబట్టి చేసిన ఈ ఘాతుకం కలకలం రేపింది. రెండు గంటల్లో ఏకంగా ఆరుగురిని హతమార్చడం రాజధాని శివారులోని షాబాద్‌ను కుదిపేసింది. కేసు పెట్టిన బాధిత బాలిక కుటుంబాన్ని, ప్రశ్నించిన తన కుటుంబాన్ని సైతం ఆ ఉన్మాది గొంతులు కోసి హతమార్చడం రాష్ర్టాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
బ్రేకింగ్ న్యూస్
షాబాద్ పోక్సో, ఆరు హత్యల నిందితుడు రాజ్ కుమార్ మృతి
కొత్తూరు మండలం పంజర్ల గ్రామం వద్ద ఒక వెంచర్లో రాజ్ కుమార్ మృతదేహం లభ్యం https://t.co/zx9OiaiGWj pic.twitter.com/obiLpX9KL1
— Telugu Scribe (@TeluguScribe) July 13, 2026