Yoga | షాబాద్, జూన్ 21: విద్యార్థులు యోగాపై ఆసక్తి పెంచుకోవాలని షాబాద్ ఎంపీడీవో అపర్ణ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం షాబాద్ మండల పరిధిలోని పోతుగల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన యోగా దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి యోగా చేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. యోగా చేయడం వల్ల దేహ దారుఢ్యానికి ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. విద్యార్థులు యోగాపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. అదే విధంగా తెలంగాణ మోడల్ స్కూల్లో కన్హా శాంతివనం ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పీఆర్ఆర్ స్టేడియంలో ఎస్ఐ సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో యువకులు యోగాసానాలు వేశారు. మండలంలోని కుర్వగూడ గ్రామంలో యువకులు యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వీరాసింగ్, పోతుగల్ పంచాయతీ కార్యదర్శి అశోక్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.