షాద్ నగర్ టౌన్, మే 27: వర్షాకాల పంటల సాగుకు సంబంధించి రైతులకు పచ్చిరొట్ట ఎరువులను సబ్సిడీపై ఇవ్వనున్నట్లు షాద్ నగర్ వ్యవసాయ శాఖ ఇంచార్జి ఏడీఏ నిశాంత్ కుమార్ మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. క్వింటాల్ రూ. 14250ఉండగా 50శాతం సబ్సిడీతో రూ. 7125లకు ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 30 కేజీల పచ్చిరొట్ట ఎరువులకు గాను రైతులు రూ.2137.50లను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పచ్చిరొట్ట ఎరువులు అవసరమైన రైతులు పట్టా పాస్ బుక్ తో పట్టణంలోని కేశంపేట్ రోడ్ లో గల ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం-2లో సంప్రదించి 30 కేజీల బ్యాగ్ కు గాను రూ.2137.50చెల్లించి తీసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వియం చేసుకోవాలని కోరారు.
షాబాద్, మే 27: రైతులకు సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు షాబాద్ మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశం మంగళవారం ఒక ప్రకటన తెలిపారు. షాబాద్ సహకార సంఘం కార్యాలయంలో ఈ వానకాలం సీజన్ కు సంబంధించి 50 శాతం సబ్సిడీపై పచ్చి రొట్టె(జీలుగ)విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. షాబాద్ మండలానికి 75 క్వింటాళ్లు జీలుగ విత్తనాలు వచ్చినట్లు తెలిపారు. 30 కిలోల జీలుగ విత్తనాల బస్తా మొత్తం ధర రూ.4275 ఉండగా, 50 శాతం ప్రభుత్వ సబ్సిడీ పోగా, రైతు రూ. 2137 చెల్లించాలన్నారు. మండలంలో జీలుగ విత్తనాలు అవసరం ఉన్న రైతులు తమ పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వచ్చి విత్తనాలు తీసుకోవాలని కోరారు. 28వ తేదీ నుంచి జీలుగ విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.