బొంరాస్‌పేట, జూన్ 16 : ఓటరు జాబితా పరిశీలన కార్యక్రమం పక్కాగా నిర్వహించాలని తహసిల్దార్ షర్మిల బీఎల్వోలను ఆదేశించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్య దర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓటరు జాబితా పరిశీలనలో భాగంగా బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి జాబితా ప్రకారం అన్నీ సక్రమంగానే ఉన్నాయా, చనిపోయిన వారి పేర్లు, వలస వెళ్లిన వారు పేర్లు తొలగించడంతో పాటు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వివరాలను పరిశీలించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్ర మాన్ని ఈ నెల 23వ తేదీ వరకు పూర్తి చేయాలని షర్మిల ఆదేశించారు. కార్యక్రమంలో డీటీ రవి, ఆర్ఐ రవిచారి పాల్గొన్నారు. ఇదిలావుండగా వచ్చే శాసనసభ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల పరిశీలన కార్యక్రమం మం డలంలో ప్రారంభమైంది. శుక్రవారం తహసీల్దార్ షర్మిల, డీటీ రవి, ఆర్ఐ రవిచారి మండలంలోని బాపల్లితండా, ఏర్పుమళ్ల, చౌదర్పలి, తుంకిమెట్ల, నాందార్‌పూర్ గ్రామాల్లో పర్యటించి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా అని వారు పరిశీలించారు.
ఇంటింటీ సర్వే నిర్వహించాలి
కులకచర్ల, జూన్ 16 : గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ఓటర్లనమోదు వివ రాలను తెలుసుకోవాలని కులకచర్ల తహసీల్దార్ రమేశ్‌కుమార్ అన్నారు. శుక్రవారం కులకచర్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్వోలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామా ల్లో ఓటర్ల జాబితా ప్రకారం ఇంటింటికీ వెళ్లి ఓటరు లిస్టును పరిశీలించాలని సూచించారు. ఓటరు లిస్టులో పేరులేని వారికి ఫారమ్-6ను నింపిం చాలన్నారు. ఒకే ఇంటిలో 6 మంది ఓటర్లకన్నా ఎక్కువగా ఉంటే వారు వేరుగా ఉంటే ఇంటినెంబర్ వేరుగా అడిగితే ఫారమ్-8ను నింపిం చాలని తెలిపారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల బీఎల్వోలు పాల్గొన్నారు.