పగలు ఎండ.. రాత్రి వాన
గ్రేటర్లో భిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు పగలంతా వేసవిని తలపించే ఎండలు దంచికొట్టడంతో పాటు గాలిలో తేమ శాతం పడిపోవడంతో నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. మరో పక్క రాత్రి సమయంలో పలుచోట్ల తేలికపాటి వాన కురిసింది.
గ్రేటర్లో భిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు పగలంతా వేసవిని తలపించే ఎండలు దంచికొట్టడంతో పాటు గాలిలో తేమ శాతం పడిపోవడంతో నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. మరో పక్క రాత్రి సమయంలో పలుచోట్ల తేలికపాటి వాన కురిసింది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలు, గాలిలో తేమ 47శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా రాత్రి 8.30గంటల సమయంలో గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది.
రాత్రి 9గంటల వరకు నగరంలోని కుత్బుల్లాపూర్, ఆదర్శ్‌నగర్‌లో అత్యధికంగా 3.75 సెం.మీలు, ఫతేనగర్‌లో 3 సెం.మీలు, బాలానగర్‌లో 2.7 సెం.మీలు, అమీర్‌పేట మైత్రీవనంలో 2.6సెం.మీలు, శ్రీనగర్ కాలనీలో 2.4సెం.మీలు, బోయిన్‌పల్లిలో 2.0 సెం.మీలు, బషీర్‌బాగ్‌లో 1.9సెం.మీలు, బంజారాహిల్స్, బేగంపేటలో 1.8సెం.మీలు, గచ్చిబౌలిలో 1.0సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. నగరంలో వర్షం కురిసిన నేపథ్యంలో బల్దియా అధికారులతో కలసి హైదరాబాద్ సీపీ సజ్జనార్ సోమాజిగూడ, ప్రజాభవన్ తదితర ప్రాంతాల్లో పర్యటించి వాటర్ లాగింగ్ పాయింట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. – సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ)
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

