షాద్‌నగర్‌టౌన్, మార్చి 10: దేశంలోని మహిళలను చదువువైపు మళ్లించిన మహనీయురాలు సావిత్రీబాయిఫూలే అని, ఆమె జీవితం ఆదర్శనీయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సావిత్రిబాయిఫూలే వర్ధంతి సందర్భంగా పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న ఆమె విగ్రహానికి శుక్రవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే మార్గమని, విద్యాలయాలను స్థాపించి మహిళలకు విద్యను బోధించిన ఘనత ఆమెకే దక్కిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కౌన్సిలర్ ప్రతాప్‌రెడ్డి, సర్పంచ్ సాయిప్రసాద్, నాయకులు జూపల్లి శంకర్, రాజశేఖర్, రఘు, శరత్కృష్ణ పాల్గొన్నారు.
శంకర్పల్లి : భారతదేశంలో మహిళల విద్యను ప్రోత్సహించిన ఘనత సావిత్రీబాయిఫూలేకు దక్కుతుందని కస్తూ ర్బా కళాశాల ప్రిన్సిపాల్ మధురవాణి అన్నారు. సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి కళాశాలలో పూలమాలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో..
కడ్తాల్ : మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రీబాయిఫూలే వర్ధంతిని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల ప్రధాన కార్యదర్శి మూడ రవి, సంఘం నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.