కాంగ్రెస్‌వి మోసపూరిత హామీలు
కాంగ్రెస్‌పార్టీ మోసపూరిత హామీలకు కాలం చెల్లిపోయిందని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు సత్తువెంకటరమణారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, బీఆర్ఎస్పార్టీ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములుతో కలిసి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్‌కు మద్దతుగా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం,
- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి
- ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారం
ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 28 : కాంగ్రెస్‌పార్టీ మోసపూరిత హామీలకు కాలం చెల్లిపోయిందని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు సత్తువెంకటరమణారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, బీఆర్ఎస్పార్టీ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములుతో కలిసి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్‌కు మద్దతుగా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం, తులేకలాన్ గ్రామాల్లో ఆదివారం ఇంటింటికీ ప్రచారాన్ని ఆలయంలో పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ..
కాంగ్రెస్‌పార్టీ రైతులకు రూ.15వేల రైతుబంధు, రెండులక్షల రుణమాఫీ, రూ.500 క్వింటాలుకు బోనస్, కౌలు రైతులకు రూ.15వేలు, రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేలు, ఉచిత కరెంటు హామీలిచ్చి కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాగానే మోసం చేసిందని విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2500, ఉచిత గృహవిద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ హామీలను అటకెక్కించిందని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేయాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో దండుమైలారం గ్రామశాఖ అధ్యక్షుడు ఐలేశ్, తులేకలాన్ అధ్యక్షుడు యాదగిరి, మాజీ సర్పంచ్ రవణమోని మల్లీశ్వరి, యాదగిరి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవణమోని జంగయ్య ముదిరాజ్, నాయకులు రవిందర్‌రెడ్డి, బీరప్ప, రాజిరెడ్డి, జగదీశ్, కృష్ణారెడ్డి, పరకాశ్, భాష, రమేష్, అంజిబాబు, శ్రీశైలం, రవీందర్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

