షాబాద్, ఫిబ్రవరి 7: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మల్లారెడ్డిగూడ ప్రత్యేకాధికారి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శారద అన్నారు. బుధవారం మండల పరిధిలోని మల్లారెడ్డిగూడ, సీతారాంపూర్, ముద్దెంగూడ గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. అదే విధంగా మండలంలోని 41 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారులు పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రోడ్లను శుభ్రం చేయడం, కలుపు మొక్కల తొలగింపు, తాగునీటి పైపులైన్ల లీకేజీలు, హరితహారం మొక్కల సంరక్షణ తదితర పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
శానిటైజేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
శంకర్పల్లి : గ్రామాలకు కేటాయించిన ప్రత్యేక అధికారులు గ్రామాల్లో శానిటైజేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీడీవో వెంకయ్య అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, పంచాయితీ కార్యదర్శులతో వారాంతపు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో గ్రామాల్లో నీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో మొక్కలను విరివిగా నాటాలన్నారు. సర్పంచ్ల పదవీకాలం ముగిసినందున ప్రత్యేక అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. సమావేశంలో ఎంపీవో గీత, ఏపీవో నాగభూషణం పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్మెట్ : గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో వారం రోజుల పాటు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన పనులను విజయవంతం చేయాలని ఎంపీపీ బుర్ర రేఖ, ఎంపీడీవో మమతాబాయి అన్నారు. మండలంలోని గ్రామాల్లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ నెల 14వ తేదీ వరకు కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో ఆయ పంచాయతీల ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
మొయినాబాద్ : గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగడంతో మొదటి రోజు ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు దగ్గర ఉండి గ్రామ పంచాయతీ సిబ్బందిచే రోడ్లను శుభ్రం చేయించారు. కలుపు మొక్కలను తొలగించారు.
నందిగామ : అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలో ఎంపీటీసీలు, అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు చంద్రపాల్రెడ్డి, కొమ్ము కృష్ణ, దేపల్లి కుమారస్వామిగౌడ్, ఎంపీడీవో బాల్రెడ్డి పాల్గొన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంతోపాటు పరిధిలోని గ్రామాల్లో ప్రత్యేకాధికారులు చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. గ్రామాల్లోని కాలనీల్లో చెత్తాచెదారాన్ని తీసివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. కాలనీల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనంద్, ఎంపీడీవో రామకృష్ణ, తహసీల్దార్ ముంతాజ్, ఎంపీవో మధుసూదనాచారి, మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటేశ్, నాయకులు లాయక్అలీ, రామచంద్రయ్య, శ్రీనివాస్, వెంకటేశ్, గణేశ్, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
యాచారం : పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని పర్యావరణాన్ని కాపాడాలని ఎంపీడీవో విజయలక్ష్మి అన్నారు. మండలంలోని చౌదర్పల్లి, యాచారం గ్రామాల్లో బుధవారం పారిశుధ్యం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు రోడ్లను చీపురులతో శుభ్రం చేశారు. రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చారు. అనంతరం యాచారంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా కొనసాగుతున్న భూ చదునుకు సంబంధించిన పనులను ఎంపీడీవో ఆధ్వర్యంలో అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ అధికారులు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
కొత్తూరు : పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వైస్ ఎంపీపీ శోభలింగంనాయక్ అన్నారు. మండలంలోని పెంజర్ల, కొడిచెర్లతండా, మల్లాపూర్ తండా, తీగాపూర్, గూడూరు, మక్తగూడ, ఎస్బీపల్లి, సిద్దాపూర్, కొడిచెర్ల, తీగాపూర్ గ్రామాల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తూరు మండలంలోని ఇన్ముల్నర్వలో జరిగిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో వైస్ ఎంపీపీ శోభలింగంనాయక్ పాల్గొన్నారు. న్ముల్నర్వలో ఎంపీడీవో శరత్చంద్రబాబుతో కలిసి వైస్ ఎంపీపీ గ్రామంలో కలియతిరిగి పరిశీలించారు. కొడిచెర్ల తండాలో జరిగిన డ్రైవ్లో ఎంపీటీసీ రవీందర్రెడ్డి, ఇన్ముల్నర్వలో అగ్గి రవికుమార్గుప్తా అయితే గ్రామాల్లో ప్రత్యేక అధికారులతో పాటు మాజీ సర్పంచ్లు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.