యాసంగికి సంబంధించి రైతుబంధు సాయం పంపిణీ షురూ అయ్యింది. బుధవారం ఎకరంలోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమయ్యింది. సెల్ఫోన్లో మెసేజ్‌లు చూసుకున్న రైతులు మురిసిపోయారు. కొందరు బ్యాంకులకు వెళ్లి నగదును డ్రా చేసుకొని మరీ ఆనందం వ్యక్తం చేశారు. తొలిరోజు రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 1,16,240 మందికి రైతుల ఖాతాల్లో రూ.32.40 కోట్ల రైతుబంధు డబ్బులు జమకాగా, వికారాబాద్ జిల్లాలో 70,082 మందికి సాయమందింది. అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 28: రైతుబంధు పండు గ రానే వచ్చింది. యాసంగి సీజన్ ప్రారంభానికి ముందే రైతుల బ్యాంకు ఖాతాల్లో పదో విడుత డబ్బులు టింగ్.. టింగ్.. అంటూ జమ అవుతున్నా యి. బుధవారం ఒక ఎకరంలోపు ఉన్న రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని జమ చేసింది. దీం తో రంగారెడ్డి జిల్లాలోని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు జిల్లాలో ఎకరం లోపు ఉన్న 1, 16,240 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 32.49 కోట్లు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. నేడు రెండు ఎకరాల్లోపు ఉన్న రైతులకు జమ చేస్తామని.. ఇలా సంక్రాంతి పండుగ లోపు జిల్లాలోని రైతులందరి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తెలిపారు.
ఆనందంగా జీవిస్తున్న రైతులు

షాద్‌నగర్ రూరల్, డిసెంబర్ 28: సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతులు సగర్వంగా, దర్జాగా బతుకుతున్నారు. సంక్షేమ పథకాల ను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో తీవ్ర ఇబ్బందులకు గురైన రైతులు ప్రస్తుతం పంటలను సాగు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. బుధవారం నుంచి పదో విడుత రైతుబంధు పెట్టుబడి సాయం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుండటంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తు న్నారు. ఈ పథ కం కింద మండలంలో 19,147 మంది రైతులు లబ్ధిపొందనున్నారు.
వికారాబాద్ జిల్లాలో 2,44,126 మంది రైతులు
బొంరాస్‌పేట, డిసెంబర్ 28: అన్నదాతలకు అదునుకు పెట్టుబడి సాయం చేతికొస్తున్నది. రాష్ట్ర ప్రభు త్వం పంటల సాగుకు వానకాలం, యాసంగి సీజన్లకు కలిసి ప్రతి ఏటా రైతుబంధు పథకం క్రింద ఎకరానికి రూ.10 వేల చొప్పున అందిస్తున్న విష యం తెలిసిందే. ఈ ఏడాది యాసంగి రైతుబంధు సాయం బుధవారం నుంచి రైతుల బ్యాంకు ఖాతా ల్లో జమ అవుతున్నది. వికారాబాద్ జిల్లాలో 2,44, 126 మంది రైతులు ఈ పథకానికి అర్హులుకాగా వీరికి రూ.299 కోట్లు పెట్టుబడి సాయంగా అందనున్నది. బుధవారం మొదటి రోజు 70,082 మం ది రైతుల ఖాతాల్లో రూ. 22 కోట్ల పెట్టుబడి సా యం జమఅయ్యింది. యాసంగి పంటల సాగుకు పెట్టుబడి సాయం అందుతుండటంతో రైతులు సం తోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు విత్తనా లు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

కడ్తాల్, డిసెంబర్ 28: రైతును రాజుగా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. బుధవారం నుంచి యా సంగి పెట్టుబడి సాయం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావడాన్ని హర్షిస్తూ మండలంలోని కర్కల్‌పహాడ్ గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆయన క్షీరాభిషేకం చేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతు బాంధవుడని, రైతులు బాగుండాలనే ఉద్దేశంతో అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. పంటల సాగుకోసం ప్రతి ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున అందించడంతోపాటు వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత కరెంట్, ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే రూ.5 లక్షలు అందజేస్తున్నారన్నారు. అన్ని కుల, చేతి వృత్తులకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహారెడ్డి, నాగమణి, హరిచంద్‌నాయక్, ఎంపీటీసీ లచ్చిరాంనాయక్, రైతుబంధు సమితి మండల, గ్రా మాల అధ్యక్షులు వీరయ్య, నర్సింహ, లాయక్‌అలీ, నర్సింహాగౌడ్, సేవ్యానాయక్ పాల్గొన్నారు.
10 గంటలకే మెసేజ్ వచ్చింది..
రైతుబంధు డబ్బులు ఖాతాలో జమైనట్లు ఉదయం పది గంటలకే నా ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అదునుకు పెట్టుబడి సాయమందించి అన్నదాతలను ఆదుకుంటున్నారు. రైతుబంధు వస్తున్నప్పటి నుంచి అప్పులు చేసే బాధ తప్పింది. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. నా ఊపిరి ఉన్నంతవరకు బీఆర్ఎస్ వెంటే ఉంటా. – మోహన్సింగ్రాథోడ్, రైతు, జమ్లనాయక్తండా
అదునుకు పెట్టుబడి సాయం అందుతున్నది
అదునుకు పెట్టుబడి సాయం అందుతున్నది. వచ్చిన డబ్బులతో అవసరమైన ఎరువులు, విత్తనాలు కొంటున్నా. రైతు బంధు పథకం లేక ముందు పంటల సాగుకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేది. బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. తొలి రోజు నా బ్యాంకు ఖాతాలోరూ.2 వేలు పెట్టుబడి సాయం జమఅ య్యింది. – కిందింటి లక్ష్యయ్య రైతు, చౌదర్పల్లి, బొంరాస్‌పేట మండలం
గుంట భూమి ఉన్నా ..
సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టి అన్నదాతను ఆదుకుంటున్నారు. గుంట భూమి ఉన్నా పెట్టుబడి సాయా న్ని అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ మేలును రైతులు గుర్తుం చుకుంటారు. -ఈడ్గి రమేశ్‌గౌడ్, రైతు, చౌదర్పల్లి, బొంరాస్‌పేట మండలం
పెట్టుబడి సాయంతో ఇబ్బందులు తొలగాయి
సీఎం కేసీఆర్ పంటల సాగుకు పెట్టుబడి సాయాన్ని అం దిస్తూ ఆదుకుంటున్నారు. వచ్చిన డబ్బులతో ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ఇబ్బందులు తప్పాయి. గతంలో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. రైతు పక్షపాతి అయిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– కళావతి, మహిళ రైతు, కొర్విచేడ్, బషీరాబాద్
రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి
తెలంగాణ సర్కారు రైతుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో అప్పటి పాలకులు రైతులను పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాతే రైతుల బతుకుల్లో వెలుగులు నిండుతున్నాయి. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నారు. – గున్న మల్లేశ్, రైతు ఎలికట్ట గ్రామం
చాలా సంతోషంగా ఉంది
ప్రభుత్వం యాసంగి పంటల సాగు కోసం పెట్టుబడి సాయా న్ని అందించడం చాలా సంతోషకరం. రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు.
– చంద్రశేఖర్, రైతు విఠ్యాల గ్రామం
ప్రభుత్వానికి రుణపడి ఉంటా..
సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి రుణపడి ఉంటా. ప్రతి ఏటా వానకాలం, యాసంగి సీజన్లకు కలిపి పంటల సాగు కోసం ఎకరానికి రూ. పదివేల చొప్పున అందజేస్తూ అందుకుంటున్నది. నాకు 34 గుంటల భూమి ఉండగా.. బుధవారం నుం చి రైతుబంధు సాయం పంపిణీ ప్రారంభం కావడంతో నా బ్యాంకు ఖాతాలో రూ.4250 జమ అయినట్లు నా ఫోన్‌కు మెసేజ్ వచ్చింది.
– సుభాష్‌చంద్రబోస్, రైతు, దోమ గ్రామం