కీసర, మార్చి 16: కీసరగుట్టలోని భవానీ రామలింగేశ్వరస్వామికి సోమవారం గర్భాలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. సోమవారం పరమశివుడికి ఇష్టమైన రోజు కావడంతో శివభక్తులు అధిక సంఖ్యలో కీసరగుట్టకు విచ్చేస్తారు.
గర్భాలయంలో స్వామివారికి తేనే, ఆవుపాలు, పంచామృతంతో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తారు. కీసరగుట్టకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయం తరుపున పూర్తి ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ తటాకం నారాయణశర్మ తెలిపారు.