బొంరాస్‌పేట, ఆగస్టు 8 : గ్రామాల నుం చి మండల కేంద్రాల్లో ఉన్న ఉన్నత పాఠశాలలు, పట్టణాల్లో ఉన్న జూనియర్, డిగ్రీ కళాశాలలకు చదువుకునేందుకు వెళ్తున్న విద్యార్థులు తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్లాలంటే బస్సుల కోసం నిరీక్షించాల్సిం దే. సమయానికి బస్సులు రాక విద్యార్థు లు చీకటి పడే వరకు రోడ్లపైనే ఉంటు న్నా రు. పాఠశాల సమయాలు మారినా విద్యార్థులకు అనుకూలంగా బస్సు వేళలను మా త్రం ఆర్టీసీ అధికారులు మార్చడం లేదు. దీంతో విద్యార్థులు చీకటి పడినా ఇంటికి వెళ్లలేని దుస్థితి నెలకొన్నది.
మండలంలో ని మదన్‌పల్లి, మదన్‌పల్లితండా, నర్స్యానాయక్తండా, దరికిందితండా, బురాన్‌పూర్, చెరువుముందలితండాలకు చెందిన అనేక మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం బొంరాస్‌పేట జడ్పీ ఉన్నత పాఠశాలకు, కళాశాల చదువుల కోసం పరిగి పట్టణానికి వెళ్తుంటారు. విద్యార్థుల సౌకర్యా ర్థం పరిగి ఆర్టీసీ అధికారులు బస్సు సౌక ర్యం కల్పించారు.
ఉదయం 8 గంటలకు మదన్‌పల్లి, బురాన్‌పూర్, బొంరాస్‌పేట, తుంకిమెట్ల మీదుగా పరిగికి ఆర్టీసీ బస్సు వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో మాత్రం ఇదే బస్సు బొంరాస్‌పేటకు సాయంత్రం ఏడు గంటల కు వస్తుంది. ఉన్నత, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు సాయంత్రం నాలుగు గంటలకే స్కూళ్ల నుంచి బయటికి వస్తారు. అప్పటి నుంచి వారు ఆ బస్సు కోసం మూడు గంటలపాటు నిరీక్షించాల్సి ఉంటుంది. చలి కాలంలో అయితే చీకటి పడి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
బస్సు వేళలు మార్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్టీసీ అధికారులను పలుసార్లు కోరినా ఫలితం లేదు. విద్యార్థులు ఇంటికొచ్చే సరికే రాత్రి అయి అలసిపోతు న్నారు. దీంతో ఉపాధ్యాయులు ఇచ్చిన హోంవర్క్నూ పూర్తి చేయలేకపోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఆర్టీసీ అధికారులు ఇప్పటికైనా స్పం దించి పరిగి నుంచి మదన్‌పల్లికి సాయంత్రం వచ్చే బస్సు వేళలను మార్చాలని, మదన్‌పల్లి నుంచి బొంరాస్‌పేటకు రెండు ట్రిప్పులు నడపాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
సాయంత్రం నాలుగు గంటలకు స్కూల్ నుంచి బయటి కొస్తాం. బస్సు 7 గంటలకు వస్తుంది. 3 గంటలపాటు బస్సు కో సం నిరీక్షిస్తాం. ఇంటికెళ్లే సరికి చీకటి అవుతుంది. హోంవర్క్ చేసేందు కు, చదువుకునేందుకు సమయం ఉండ డంలేదు. బొంరాస్‌పేటలో 4.30కు బస్సు ఉండేలా సమయాన్ని మార్చాలి.
-విజయ్.
సాయంత్రం వేళల్లో ఇంటికొళ్లేందుకు సమయానికి బస్సు ఉండడం లేదు. ఒక్కోసారి పరిగి నుంచి 7.30 గం టలకు బస్సు వస్తుంది. అప్పటివరకు చలికి, వర్షానికి తడుస్తూ ఉండాల్సిందే. అధికారులు మా ఇబ్బందుల ను గుర్తించి మదన్ప ల్లి బస్సు వేళలను మార్చాలి.
-ఆంగోత్ రూపేశ్, పదోతరగతి, దరికిందితండా.