కడ్తాల్, మే 11 : ప్రపంచంలో అమ్మలేని గ్రామం, దేశం లేదని., సృష్టికి మూలం అమ్మ అని మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ రజినీ సాయిచంద్ అన్నారు. ఆదివారం మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కంబాల పరమేశ్ అధ్యక్షతన, ఉప్పల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కడ్తాల్‌లోని అంగన్వాడీ సబ్ సెంటర్లో మండలంలోని గర్భిణులకు న్యూట్రిషన్, మెడికల్ కిట్లను తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్గుప్తాతో కలిసి వారు పంపిణీ చేశారు.
అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. అమ్మతనం మాటల్లో వర్ణించలేనిదని, అక్షరాల్లో రాయలేనిది అమ్మ ప్రేమ.. ఈ సృష్టిలో తియ్యని పదం అమ్మ.. వెలకట్టలేనిది అమ్మ ప్రేమ అని పేర్కొన్నారు. ఆప్యాయతలో ఇంకెవరూ సాటిరారన్నారు. ప్రస్తుత తరుణంలో యువత చెడు అలవాట్లకు బానిసై అమ్మతనాన్ని మరిచి కొత్తపుంతలు తొక్కుతున్నారని.. అలాంటివారిని ఆ దైవమే రక్షించాలన్నారు. ఈ సందర్భంగా 240 గర్భిణులకు మెడికల్ కిట్లు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో ఉప్పల చారిటబుల్ ట్రస్టు చైర్మన్ సతీమణి మంజుల, కుమారుడు, కోడలు అనిల్, భావన, మాజీ జడ్పీటీసీలు దశరథ్‌నాయక్, విజితారెడ్డి, సీనియర్ నాయకులు చంద్రమౌళి, లచ్చిరాం, నర్సింహ, సాయిలు, లక్ష్మీనర్సింహారెడ్డి, జ్యోతయ్య, గోపాల్, వెంకటేశ్, శంకర్, శ్రీనివాస్, గోపాల్, సురేశ్, శ్రీకాంత్, గణేశ్, మహేశ్, రంగయ్య, రమేశ్, సాయిలు, జంగయ్య, రామకృష్ణ, యాదయ్య, లాయక్‌అలీ, రవి పాల్గొన్నారు.