వికారాబాద్, మార్చి 9 : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహ నిర్మాణానికి రూ.ఆరు కోట్లు కేటాయించారు. ఆగస్టు 5, 2024న స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, రాష్ట్ర రెవెన్యూ , గృహ నిర్మా ణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి శిలాఫలకం వేశారు. ఉన్న భవనం శిథిలావస్థకు చేరడంతో నూతన భవనాన్ని నిర్మిస్తామన్నారు.
అందులో రూ.6 కోట్లతో జీ ప్లస్-1 భవ నాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలూ తయారు చేశారు. శిలాఫలకం వేసి దాదాపుగా ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పనులను ప్రారంభించలేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఆ భవనాన్ని త్వరగా పూర్తి చేసిన అం దుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.