పేదింట కల్యాణ కాంతులు
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింట కల్యాణ కాంతులు విరజిమ్ముతున్నాయి. ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ మేనమామలా మారి ఆర్థిక సాయం అందిస్తున్నారు.
- రూ.1,00,116 చొప్పున నగదు సాయం
- నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ
- ఆడబిడ్డ పెండ్లికి భరోసానిస్తున్న రాష్ట్ర సర్కార్ కానుక
- 66,252 మందికి రూ.500 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయం
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింట కల్యాణ కాంతులు విరజిమ్ముతున్నాయి. ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ మేనమామలా మారి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ పథకాలతో పెండ్లి కష్టాలు తీరడమే కాకుండా బాల్య వివాహాలు కూడా గణనీయంగా తగ్గాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద రాష్ట్ర సర్కార్ ఎంతోమంది ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. ఒక్కో ఆడబిడ్డ వివాహానికి రూ.లక్షా116లను కానుకగా అందజేస్తున్నది. ఇప్పటివరకు జిల్లాలో 66,252 మంది లబ్ధిదారులకు రూ.500కోట్ల్ల నగదు సాయమందించింది. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తున్నది.
-రంగారెడ్డి, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, నవంబరు 11(నమస్తే తెలంగాణ) : పేదింట పెండ్లి బాజాలు మోగుతున్నాయి. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలతో కల్యాణ కాంతులు విరజిమ్ముతున్నాయి. ఆడబిడ్డల పెండ్లికి పేదరికం అడ్డుకాకూడదన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ రెండు పథకాలు రంగారెడ్డి జిల్లాలో ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచాయి. మేనమామ వలే పెళ్లి కూతుళ్లకు రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ ఆడబిడ్డల తల్లిదండ్రులకు కొండంత భరోసాను కల్పించారు. ఈ పథకాలు పెండ్లి కష్టాలను తీర్చడమే కాకుండా బాల్య వివాహాల జాడ్యాన్ని కూడా గణనీయంగా తగ్గించాయి. 2014 సంవత్సరం నుంచి రంగారెడ్డి జిల్లాలో 66,252 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా లబ్ధి చేకూరింది. ఇందుకుగాను ప్రభుత్వం రూ.500కోట్ల వరకు వెచ్చించింది.

తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా..
ఆడపిల్ల పెండ్లి చేయడం పేద కుటుంబాలకు తలకు మించిన భారంగా ఉంటున్నది. కూతురు వివాహం చేసి అప్పుల పాలై ఆర్థికంగా చితికిపోయిన వారెందరో ఉన్నారు. ఆడపిల్లల వివాహం చేయలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఈ తరహా ఇబ్బందులను తొలగించేందుకు సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టి సాయం అందిస్తూ వస్తున్నారు. తొలుత 50వేల ఆర్థిక సాయాన్ని అందించగా.. క్రమంగా పెంచుతూ ప్రస్తుతం రూ.1,00,116లను అందజేస్తున్నారు. దివ్యాంగ ఆడపిల్లలకు 25 శాతం అదనంగా రూ.1,25,116లను ప్రభుత్వం అందిస్తున్నది. మొదట్లో ఎస్సీ, ఎస్టీలకే పరిమితమైన ఈ పథకం అన్ని వర్గాలను ఆదుకుంటున్నది. 2022-23 సంవత్సరంలోనే కల్యాణలక్ష్మి ద్వారా 7,469 మంది ఆడపిల్లలకు రూ.74.77కోట్లు, షాదీ ముబారక్ ద్వారా 3,467 మంది ఆడపిల్లలకు రూ.34.71కోట్ల సాయం అందించి ప్రభుత్వం పేద తల్లిదండ్రుల బాధలను దూరం చేసింది.
బాల్య వివాహాలకు బ్రేక్..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంతో బాలికలకు పరోక్షంగా పటిష్టవంతమైన భరోసా ఏర్పడింది. ఈ పథకాలు లేక ముందు జిల్లాలో అనేక బాల్య వివాహాలు జరిగేవి. స్కూళ్లలో బాలికల డ్రాప్ అవుట్లు ఎక్కువగా ఉండేవి. ఈ పథకాలు అమలుల్లోకి వచ్చాక ఇవన్నీ తగ్గుముఖం పట్టాయి. చెక్కుల రూపంలో నేరుగా వధువు తల్లిదండ్రులకే ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తున్నది. దీంతో వివాహ ఖర్చులకు అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. 18 సంవత్సరాలు దాటిన తర్వాతనే ఆడబిడ్డలకు పెండ్లిళ్లు చేయాలని సంకల్పించి సీఎం కేసీఆర్ కానుకగా ఇచ్చే సాయంతో ఆర్భాటంగా వివాహాలను నిర్వహించుకుంటున్నారు. బాలికలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు.
అప్పు బాధ తప్పింది..

కల్యాణలక్ష్మి పథకం వచ్చాక పేదలకు అప్పుల బాధ తప్పింది. పథకం ప్రవేశపెట్టక ముందు ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే అప్పు చేయాల్సిందే. పథకం వచ్చాక పెండ్లికి ఎంతో ఆసరా అవుతున్నది. సీఎం కేసీఆర్ ఆడబిడ్డల మేనమామగా గుండెల్లో నిలిచారు. ఇంత మంచి ప్రభుత్వానికి మరోసారి ఓటు వేస్తా.
ఆడబిడ్డల పెండ్లికి భరోసా..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడబిడ్డల పెండ్లిళ్లకు కొండంత భరోసానిస్తున్నాయి. మా బిడ్డ పెండ్లి చేసిన కొన్ని రోజుల్లోనే రూ. లక్షా,116ల కల్యాణలక్ష్మి చెక్కు వచ్చింది. దీంతో ముందుగా చేసిన అప్పులు కట్టుకున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవు. ప్రజల శ్రేయస్సు కోరుకునే బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటే ప్రజలు ఉన్నారు. మళ్లీ మూడో సారి బీఆర్ఎస్ అధికారంలోకి
కల్యాణలక్ష్మి పథకం చాలా గొప్పది..
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన కల్యాణలక్ష్మి పథకం చాలా గొప్పది. నిరుపేదల కుటుంబాల్లోని ఆడబిడ్డల పెండ్లిళ్ల సమయంలో ఈ పథకం ఎంతో ఆదుకుంటున్నది. ఆడపడుచు పెండ్లికి ప్రభుత్వం రూ.1,00,116లు అందజేస్తున్నారు. ఈ పథకంతో నిరుపేదల కుటుంబాలకు సీఎం కేసీఆర్ సార్ మేనమామ అయ్యిండు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆడబిడ్డ పెండ్లికి సాయం చేసిన దాఖలాలు లేవు. ప్రభుత్వం చేస్తున్న సాయంతో ఖర్చుల భారం తగ్గుతున్నది. కల్యాణలక్ష్మీ పథకంతో పేదలను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్కే మళ్లీ ఓటు వేస్తా.
– బాలమణి, కడ్తాల్ మండలం
పేద కుటుంబానికి భరోసా..
పేద కుటుంబానికి కల్యాణలక్ష్మి ఎంతో భరోసా ఇస్తున్నది. సీఎం కేసీఆర్ ఈ పథకంతో పేదలకు ఆర్థికంగా సాయం చేస్తున్నారు. మా కుమార్తె కుమార్తె వివాహం చేశాను. మాకు ఎకరం ఇరవై గుంటల భూమి ఉన్నది. వ్యవసాయంతో పాటు ఇతర పనులను చేసుకుంటున్నాం. సీఎం కేసీఆర్ పేదల కోసం తెచ్చిన కల్యాణలక్ష్మి పథకం ద్వారా వచ్చిన లక్షా నూటా పదహారు రూపాయల సాయం అందింది. ఆర్థికంగా చేయూతనందుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– బోయిని మంగమ్మ, అయినాపూర్(దోమ )
ఆడబిడ్డ పెండ్లికి సాయం చేయడం సంతోషకరం..
ఆడబిడ్డ పెండ్లి సాయం చేయడం చాలా సంతోషకరం. ఇదివరకు అమ్మాయి పెండ్లి చేయాలంటే నానా ఇబ్బందులు పడేటోళ్లం. అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఉండేది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకలతో కొంతమేర ఉపశమనం లభిస్తున్నది. గత 70 ఏండ్ల పాలనలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాలను అమలు చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నది. నా బిడ్డ పెండ్లి చేశాను. సర్కార్ నుంచి రూ.లక్ష 116 సాయం అందింది. మేనమామ పాత్ర పోషిస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– లలిత ఊరేళ్ల గ్రామం, చేవెళ్ల మండలం
పేదల పెన్నిధి కేసీఆర్

పేదల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదల పెన్నిధి అయ్యారు. కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు ఎంతో ఆసరా అవుతున్నది. దేశంలో నేను ఎక్కడా ఇలాంటి పథకం చూడలేదు. మన రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేస్తుండడం సంతోషకరమైన విషయం. సబ్బండ వర్ణాల కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇటువంటి సీఎం ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. గతంలో ఆడ బిడ్డ పెండ్లి చేయాలంటే అప్పులు చేసే దుస్థితి ఉండేది. రాబోవు ఎన్నికల్లో కేసీఆర్ గెలిస్తే ఇప్పుడు ఇస్తున్న దానికి రెట్టింపు ఇస్తామన్నారు. ఇది చాలా సంతోషించాల్సిన అంశం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కేసీఆర్కు రుణపడి ఉంటారు.
తల్లిదండ్రులకు కొండంత భరోసా..
అడపిల్లల తల్లిదండ్రులకు కల్యాణలక్ష్మి పథకం కొండంత భరోసాను ఇస్తున్నది. మహిళల సంక్షేమం కోసం తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా సంతోషకరం. అర్హులైన ప్రతి అడపడుచు పెండ్లికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నది. నా కూతురి వివాహానికి కల్యాణలక్ష్మి పథకం కింద రూ.100116లు వచ్చాయి. ఎవరి అలోచించని విధంగా సీఎం కేసీఆర్ అలోచన సరళీ ఉంటుంది.మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలతో ఆర్థిక అసమానతలు తొలుగుతున్నాయి.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

