పనులను పూర్తి చేయాలి
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
- ‘మన ఊరు-మన బడి’ పనులపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష
పరిగి, సెప్టెంబర్ 1: మన ఊరు-మన బడి కార్యక్రమంలో మంజూరైన పనులను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ సమావేశం హాలులో ‘మన ఊరు-మన బడి’ పనుల పురోగతిపై వివిధ ఇంజినీరింగ్ శాఖల ఏఈలు, డీఈలతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంజూరైన 38 మోడల్ పాఠశాలల్లో విద్యుత్, మైనర్, మేజర్ పనులు, పెయింటింగ్ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. 23 పాఠశాలల్లోనూ అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను చేపట్టి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టనున్న ప్రహరీలు, మరుగుదొడ్ల పనులకు వెంటనే అంచనాలు తయారుచేసి ఎఫ్‌టీవోలు అప్లోడ్ చేయాల్సిందిగా కలెక్టర్ సూచించారు. సమావేశంలో డీఆర్వో అశోక్‌కుమార్, డీఈవో రేణుకాదేవి, ఇంజినీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలి
జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని వందశాతం పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ అధికారులను ఆదేశించా రు. గురువారం కలెక్టరేట్లోని సమావే శం హాల్లో జిల్లా వైద్యాధికారులతో ఆమె సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి టీకాలు వేయాలన్నారు. వ్యాక్సినేషన్లో నిర్లక్ష్యం తగదన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

