ఇబ్రహీంపట్నం, మార్చి 18 : అనాజ్పూర్ గ్రామంలోని సర్వేనెంబర్ 274, 275, 276, 277, 278, 281లల్లో సుమారు 125మంది రైతులకు పట్టా పాసుపుస్తకాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున వెంటనే రైతులకు పట్టాపాసుపుస్తకాలు అందజేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి రైతుకు పట్టాపాసుబుక్లు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ముత్యాలు, జంగయ్య, లింగస్వామి, భిక్షపతి, మహేష్, రాములు, యాదయ్య, రంగయ్య, రవికుమార్ తదితరులున్నారు.