పరిగి, జూలై 12 : వ్యవసాయానికి మూడు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరి పోతుం దని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడడంతో రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ అసలు నైజం బయటపడిందని పరిగి ఎంపీపీ కరణం అరవిందరావు, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయ కుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్ విమర్శించారు. తానా సభలలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం పరిగిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహ నం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో గతంలో కాంగ్రెస్ పాల నలో కరెంటు కష్టాలు మరోసారి గుర్తుకు వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వం లోని బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయరంగానికి 24 గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తుండడంతో రైతులు ఆనందంగా పంటలు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కె.వెంకట్ రామ కృష్ణారెడ్డి, వెంకటయ్య, శ్రీని వాస్, ఎంపీటీసీలు కె.వెంకట్రాంరెడ్డి, రవి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంతోశ్ , కౌన్సిలర్లు వారాల రవి, ఎదిరె కృష్ణ, వెంకటేష్, నాగేశ్వర్, నాయకులు రవికుమార్, ముకుంద శేఖర్, తాహెర్‌అలీ, ఆసిఫ్, రాజు పాల్గొన్నారు.
తాండూరు: రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ తాండూరు నియోజక వర్గంలో బుధవారం బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేసి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో పట్టణ అధ్యక్షుడు నయీం ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహ నం చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌ను రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ నేతలకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
బొంరాస్‌పేట: కాంగ్రెస్ తన పాలనలో వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించిందని విద్యుత్ కోతలతో రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు చాలన్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం బొంరాస్‌పేట, దుద్యాల మండలాల్లో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. బొంరాస్‌పేటలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను ఊరేగించి చౌరస్తాలో దహనం చేశారు. దుద్యాలలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినా దాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ శ్రావణ్‌గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట్ల యాదగిరి, రైతుబంధు అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ తాలుకా,మండల యూత్ అధ్యక్షుడు నరేష్‌గౌడ్, మహేందర్, కోఆప్షన్ సభ్యుడు ఖాజా మైనుద్దీన్, ఎంపీటీసీ ఎల్లప్ప, మాజీ వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, పార్టీ నాయకులు దేశ్యా నాయక్, రమణారెడ్డి, బసిరెడ్డి, యూనుస్, బండశ్రీనివాస్, రవిగౌడ్, వెంకటయ్య, సలాం పాల్గొన్నారు.
తాండూరు రూరల్: రైతులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బేషరుతుగా క్షమాపణ చెప్పాలని తాండూరు మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గౌతాపూర్ వై జంక్షన్లో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి, రాస్తారోకో నిర్వ హించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాందాస్, జిల్లా ఎంపీ టీసీల ఫోరం అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, సీనియర్ నాయకుడు ఉమాశంకర్, మహిళా నాయకురాలు శకుంతల, రైతు బంధు సమితి మండల కన్వీనర్ రాం లింగారెడ్డి, సర్పంచ్‌లు బీడే నాగప్ప, నరేందర్‌రెడ్డి, మదన్మోహన్, హేమంత్ కుమార్, మాజీ వైస్ ఎంపీపీ శేఖర్, వీరేందర్‌రెడ్డి, బక్కప్పముదిరాజ్, ఓగిపూర్ నర్సింహులు ముదిరాజ్, బీఆర్ఎస్ నాయకులు రాకేష్, హుసేన్పటేల్ పాల్గొన్నారు.
పెద్దేముల్ : రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా కోహిర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రంగయ్య,గ్రామ కమిటీ అధ్యక్షుడు డీవై ప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు రవికాంత్, మాణిక్యం, మహమ్మద్, శుబ్లి, వెం కట్, రాము లు, వెంకటయ్య, చందర్, రమేశ్‌గౌడ్, మహేశ్‌గౌడ్, శశికుమార్, వెంకటయ్య, శ్రీనివాస్,రాంచంద్రి కిష్టప్ప,ఎల్లప్ప, రాములు, నర్సింహులు పాల్గొన్నా రు.
బంట్వారం: మండల కేంద్రంతో పాటు, తొరుమామిడి, బొపునారం తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఖాజాపాషా, సుదర్శన్‌రెడ్డి, శ్రీనివాస్, బల్వంత్‌రెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
కోట్‌పల్లి: మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో సంబంధింత గ్రామాల రైతులు రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సుందని అనిల్ ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
యాలాల: లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో ఎంపీపీ బాలేశ్వర గుప్తా, బీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు రవీందర్ రెడ్డిల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రమేశ్, అక్బర్ బాబా, సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.
మర్పల్లి: మర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులు, రైతులు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సమీపంలో దిష్టిబొమ్మను దహ నం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, సర్పంచుల సంఘం మడలాధ్యక్షుడు శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యుడు సోహెల్, రైతు బంధు మండలా ధ్య క్షుడు నాయబ్‌గౌడ్, డైరెక్టర్ యాదయ్య, సర్పంచులు పాండు, అనిల్, ఎంపీటీసీ మల్లేశం, మర్పల్లి బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ గఫార్, నాయకులు షఫీ, సంజీవరెడ్డి, రాజు, సుధాకర్ పాల్గొన్నారు.
మోమిన్‌పేట: మండల కేంద్రంలో రైతులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొ న్నారు.
దోమ: రైతులకు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని దోమ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు గోపాల్‌గౌడ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని హనుమాన్ చౌరస్తాలో రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు.ఈ కార్యక్రమంలో పాల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ భీమ్సేన్, మాజీ చైర్మన్ గొల్ల శ్రీనివాస్, వార్డు సభ్యులు రమేశ్, మైను, సాయి, పార్టీ నాయకులు కృష్ణయ్య, శ్రీని వాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, డైరెక్టర్లు,రైతులు పాల్గొన్నారు.
కులకచర్ల: కులకచర్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన అనంతరం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, మాజీ ఎంపీపీ రాజప్ప, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు పీరంపల్లి రాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంతారం మొగులయ్య, శివానంద్, జనార్ధన్‌రెడ్డి, వెంకటయ్య, రవి, నర్సింహులు, తిరుపతి, మొగులయ్య, కామునిపల్లి మాజీ సర్పంచ్ బాలయ్య, అం తారం సర్పంచ్ కృష్ణ, చాలపగూడెం సర్పంచ్ లక్ష్మణ్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే చౌడాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభా గం మండల అధ్యక్షుడు మేగ్యానాయక్, పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర కార్య దర్శి మందిపల్ వెంకట్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మఠం రాజశేఖర్, పరిగి అశోక్, నర్సింహులు, యాదయ్య, ఉపసర్పంచ్ శివకుమార్ పాల్గొన్నారు.
ధారూరు: ధారూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో రైతులు, ప్రజాప్రతి నిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి, వికారాబాద్- తాండూర్ ప్రధాన రోడ్డు పై ఆందోళన చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.మండల పరిధిలోని అంతారం, మోమిన్‌కలాన్, కేరెళ్లి, రాజాపూర్, కుక్కింద, గట్టేపల్లి, మైలా రం, తరిగోపుల, నాగుసాన్పల్లి, మోమిన్‌ఖుర్దు, పీసీఎంయం తండా తదితర గ్రా మాల్లో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు రాజూనాయక్, వేణుగోపాల్ రెడ్డి, కావలి అంజయ్య, సంతోశ్ కుమార్, వెంకటయ్య, జైపాల్ రెడ్డి, రాములు, రాజూగుప్తా అంజయ్య, మహేష్, రహిమతుల్లా, చంద్రమౌళి, రవీందర్, లక్ష్మయ్య, ఆయా గ్రామాల ప్రజా ప్రతి నిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.