పరిగి టౌన్, డిసెంబర్ 5 : రోడ్డుపై దొరికిన డబ్బులను పోగొ ట్టుకున్న వ్యక్తికి తిరిగి అప్పగించి తన నిజాయితీని ఓ యువ కుడు చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పూడూరు మండల పరిధిలోని సిరిగాయపల్లి గ్రా మానికి చెందిన యాదయ్య రోడ్డుపై వెళ్తుండగా గంజ్రోడ్లోని బ్యాంకు దగ్గర 10 వేల రూపాయలు దొరికాయి. దీంతో అతను ఎవరైనా డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తులు వచ్చి అడి గితే ఇచ్చేద్దామని అక్కడే నిలబడి ఉన్నాడు. డబ్బులు పోగొ ట్టుకున్న శివరామ్ అనే వ్యక్తి పడిపోయిన డబ్బులు తనవేనం టూ అందుకు సంబంధించిన ఆధారాలు చూపించాడు. వెంటనే పరిగి పోలీస్టేషన్‌కు వెళ్లి దొరికిన డబ్బులను ఏఎస్సై రమేశ్ సమక్షంలో బాధితుడికి అందజేశాడు. ఈ సందర్భంగా పలువురు యాదయ్యను అభినందించారు