అబ్దుల్లాపూర్‌మెట్, మార్చి 9 : డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రధాన అనుచరుడు విజయ్‌కుమార్, పార్టీ అబ్దుల్లాపూర్‌మెట్ మం డల అధ్యక్షుడు కిషన్‌గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి సమక్షంలో బండరావిరాల గ్రామానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో శ్రేణులు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. బీఆర్ఎస్తోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రతి కు టుంబానికి న్యాయం జరిగిందన్నారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల వారు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ మాజీ అధ్యక్షుడు పూజారి చక్రవర్తిగౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు గుండ్ల జంగయ్యయాదవ్, దానేశ్, దయాకర్‌రెడ్డి, అర్జున్, కార్యకర్తలు తదితరులు ఉన్నా రు. పార్టీలో చేరిన వారిలో లక్ష్మణ్, యాదగిరి, సుబ్బారావు, రవి, శ్రీరాం, కుమార్, నరేశ్, రమేశ్ రాజు, పృథ్వీ, శివశంకర్, భర త్, బస్వరాజ్, మల్లేశ్, శివప్రసాద్ తదితరులు ఉన్నారు.