తుర్కయంజాల్,జూలై 7: తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి ఇంజాపూర్ ల్యాండ్ మార్క్ కాలనీకి వేళ్లే ప్రధాన రహదారిలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంబాన్ని వేరే చోటుకు తరలించాలని కోరుతూ సోమవారం ఇంజాపూర్కు చెందిన కొండ్రు పురుషోత్తం రాగన్నగూడలోని ఇబ్రహీంపట్నం డివిజన్ కార్యాలయంలో విద్యుత్ శాఖ డీఈ నరేష్కుమార్కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బముగా ఆయన మాట్లాడుతూ ఇంజాపూర్ ల్యాండ్ మార్క్ కాలనీకి వేళ్లే దారిలో రోడ్డు పక్కన విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఉందని దాని మరొక చోటుకు మార్చాలని విద్యుత్ శాఖ డీఈకి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. దీనిపై డీఈ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బచ్చిగళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.