Keshampet | కేశంపేట, జూన్ 8 : రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని కోనాయపల్లి, కొత్తపేట గ్రామాల మధ్య విరిగిపడిన చెట్లను గ్రామానికి చెందిన యువ నాయకుడు జి.సురేశ్ ఆధ్వర్యంలో తొలగించారు. కేశంపేట మండలంలో శనివారం భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి రహదారికి ఇరువైపుల గల చెట్లు విరిగిపడి ప్రయాణికులు, వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించాయి. దీంతో స్పందించిన సురేశ్.. తన సొంత డబ్బులు వెచ్చించి జేసీబీ సాయంతో రహదారిపై అడ్డంగా పడిన చెట్లను తొలగించారు.
కొత్తపేట నుంచి మహేశ్వరం వయా హైదరాబాద్కు వాహనదారులు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని.. అలాంటి మార్గంలో విరిగిపడిన చెట్లను తొలగించి ప్రయాణానికి సుగమం చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.